స్నేహితుడి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ప్రభుత్వోద్యోగి కేసులో అతని భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. 

న్యూఢిల్లీ : 2020 మరియు 2021 సంవత్సరాల్లో మూడు నెలల పాటు మరణించిన తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఖాఖా భార్య సీమా రాణిని కూడా పోలీసులు అరెస్టు చేశారు, ఈ నేరానికి సహకరించారని, బాధితురాలికి అబార్షన్ మాత్రలు వేసారని ఆమె మీద ఆరోపణలు మోపారు. ఈ మేరకు సిఆర్‌పిసి సెక్షన్ 164 కింద బాలిక తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన తర్వాత అరెస్టు జరిగింది. బాలిక తన ప్రాథమిక ఫిర్యాదులో చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించినట్లు తెలిసింది. 

ఆసుపత్రిలో వాంగ్మూలం నమోదు చేశారు. సోమవారం ఉదయం ఖాఖా (51) ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించబోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.
డిసిపి (ఉత్తర జిల్లా) సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ.. "నిందితుడు అతని భార్య.. తండ్రి చనిపోయిన చిన్నారి బాధ్యతను తీసుకున్న స్థానిక సంరక్షకులు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది". బాలికకు జరిగిన దారుణం తెలిసీ సహకరించిన రాణి(50)ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు, చర్చిలో సామూహిక ప్రార్థనల సమయంలో వారి కుటుంబాలు దగ్గరయ్యాయని తెలిపింది. నిందితుడిని "మామా" అని పిలవడం ప్రారంభించానని బాలిక వెల్లడించింది. బాలిక తల్లిదండ్రులు వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. ఆమె తండ్రి గుండెపోటుతో 2020లో మరణించారు, ఆ తర్వాత ఆమె నిందితుడి కుటుంబంతో కలిసి ఉండడానికి వచ్చింది. 

"తండ్రి మరణం తర్వాత అతను తన జీవితంలో ఒక ఆశాకిరణంగా కనిపించాడని ఆమె చెప్పింది" అని ఆమె ప్రకటనను ఉటంకిస్తూ ఒక సీనియర్ పోలీసు చెప్పారు. "అయినప్పటికీ, అతను తనను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పడంతో.. అతని ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది. దీంతో విషయాలు మరింత అధ్వాన్నంగా మారాయి. అలా బాలికపై చాలాసార్లు అత్యాచారం జరిగింది. దీంతో ఆమె తీవ్రంగా భయపడిపోయింది. అతను తనను క్షమించమని బాలికను అడిగాడు. ఆ తర్వాత తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లింది. 

తల్లిని అవమానించారన్న కోపం.. భార్య, బావమరిది, వదినని కాల్చి చంపిన వ్యక్తి...

ఆమె ఈ విషయం తల్లికి చెప్పకపోయినా.. తరచుగా ఆమెకు యాంక్జైటీ అటాక్స్ వస్తుండడంతో.. తల్లి ఆమెను ఆస్పత్రిలో చేర్చింది. అక్కడ ఓ కౌన్సిలర్‌ ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. ఆ సమయంలో బాలిక తెలిపిన విషయాలు వారిని షాక్ కు గురి చేశాయి. దీంతో కౌన్సెలర్, ఆసుపత్రి గత వారం పోలీసులకు సమాచారం అందించాయి."

బాలిక అక్టోబర్ 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు నిందితుడి కుటుంబంతో నివసించింది. ఈ సమయంలో, నిందితులు తనను లైంగికంగా వేధించారని, పదేపదే అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది. 2021లో ఆమెకు గర్భం వచ్చింది. ఆమె దాని గురించి సీమాకు తెలియజేసింది. సీమా తనను దుర్భాషలాడిందని, బెదిరించిందని ఆరోపించారు. 

"అబార్షన్ తర్వాత, అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసి తన ఇంటికి తీసుకెళ్లమని కోరింది. ఆమె చాలా కామ్ అయిపోయింది. దీనిగురించి వారు తల్లికి చెబుతూ తండ్రి చనిపోయిన దుంఖం నుంచి బయటపడలేదని తెలిపారు. ఇంటికి వచ్చాక ఈ సంవత్సరం ఆగస్టులో, బాలిక యాంగ్జైటీకి గురవ్వడం మొదలయ్యింది. ఆసుపత్రిలో చేరింది" అని పోలీసులు చెప్పారు.

కేసు గురించి తెలిసిన వెంటనే, స్టేట్‌మెంట్ కోసం బాలికను సంప్రదించడానికి ప్రయత్నించామని, అయితే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ చెప్పారని ఒక అధికారి తెలిపారు. మైనర్ తీవ్రంగా భయపడిపోయేది. కొన్నిసార్లు ఆమె మూర్ఛపోయేది.

పోలీసులు ఖాఖాపై బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టంలోని సెక్షన్ 6, 21తో పాటు IPC ససెక్షన్‌లు 376(2)(ఎఫ్) (రేప్), 509 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (బాధ కలిగించడం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయడం) 120 బి (క్రిమినల్) కింద కేసు నమోదు చేశారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేస్తామని ఓ అధికారి తెలిపారు.నిందితుడు బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)