Asianet News TeluguAsianet News Telugu

Delhi police: ఉగ్ర కుట్ర భ‌గ్నం.. 2 వేల‌ తూటాలు స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు 

Delhi police: భార‌త స్వాతంత్య్ర‌ దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. భారీ కుట్ర‌ను ఢిల్లీ పోలీసులు భ‌గ్నం చేశారు

Delhi police Say Terror Angle Not Ruled Out Over 2,000 Cartridges Found   
Author
Hyderabad, First Published Aug 13, 2022, 7:11 AM IST

Delhi police: స్వాతంత్య్ర‌ దినోత్స‌వ వేడుక‌ల వేళ ఉగ్ర‌వాదుల‌ భారీ కుట్ర‌ను ఢిల్లీ పోలీసులు భ‌గ్నం చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని త‌ర‌లిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఆరుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. పట్‌పర్‌గంజ్ ప్రాంతంలో అరెస్టు చేసిన వారి నుంచి 2,251 (లైవ్ కాట్రిడ్జ్‌)తూటాల‌ను స్వాధీనం తూర్పు ఢిల్లీ పోలీసులు చేసుకున్నారు. స్వాతంత్య్ర‌ దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో పోలీసుల భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. త‌నిఖీల స‌మ‌యంలో అనుమానాస్ప‌ద వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా అసిస్టెంట్ పోలీసు క‌మిష‌న‌ర్ విక్రంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు ఆ తూటాల‌ను ల‌క్నోకు త‌ర‌లించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు తేలింద‌న్నారు. ఈ కుట్ర‌లో ఉగ్ర‌వాదుల ప్ర‌మేయం ఉండొచ్చ‌నే కోణంలో కూడా విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు. ఆరుగురిలో ఒక‌రు డెహ్రాడూన్‌కు చెందిన వ్య‌క్తి అని, అత‌ను గ‌న్ హౌజ్‌కు ఓన‌ర్ అని తెలిపారు. 


భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఢిల్లీ సహా ఎర్రకోట వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఆనంద్ విహార్ ప్రాంతంలో ఇద్దరు నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేప‌థ్యంలో చారిత్రక ఎర్రకోట చుట్టూ 10 వేల మందికి పైగా పోలీసులు మోహరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. నగర పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఢిల్లీలో ప‌లు చోట్ల‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఢిల్లీలోని మెట్రో స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు, విమానాశ్ర‌యాల‌తో పాటు మార్కెట్ల వ‌ద్ద పోలీసులు నిఘా పెంచారు. నిత్యం హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌త్యేకంగా నియ‌మించిన పోలీసులంతా రెడ్‌ఫోర్టుకు వ‌చ్చే దారుల‌పై నిఘా పెట్టి, బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు.

స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) దీపేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఫూల్ప్రూఫ్ భద్రతా ఏర్పాట్లు చేసామని తెలిపారు. డ్రోన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని, అంతర్ రాష్ట్ర స్థాయితో పాటు ఇంటెలిజెన్స్, కేంద్ర ఏజెన్సీలలో సమన్వయం జరుగుతుందని తెలిపారు. IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) ఉనికిని నిర్ధారించడానికి ప్రణాళికాబద్ధంగా,భారీ మొత్తంలో భద్రత చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. అలాగే.. గాలిలో బెలూన్స్, గాలిపటాలను ఎగరేయకుండా నిరోధించడానికి ఎర్రకోట, దాని చుట్టుపక్కల 400 మందికి పైగా ప్ర‌త్యేక సిబ్బందిని మోహరించినట్లు పాఠక్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios