రీల్స్ కోసం మీ ప్రియమైన వారు రోడ్డు పై భద్రత లేకుండా వెళ్తున్నారని క్యాప్షన్ పెట్టి, ఇలాంటి పిచ్చి పనులు షేయకండి అని క్యాప్షన్ జత చేశారు. సురక్షితంగా వాహనాలు నడపండి అంటూ పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులు రోజు రోజుకీ చాలా స్మార్ట్ గా మారిపోతున్నారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు ఏదో ఒక విధంగా వివరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని స్మార్ట్ వేస్ ని, టెక్నాలజీ ని కూడా వారు వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. తాజాగా, ఓ వధువు బండిపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న వీడియోని షేర్ చేసి మరి ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం విశేషం.
ఆ వీడియోలో ఓ వధువు స్కూటీ పై హెల్మెట్ లేకుండా వెళుతోంది. దీనిని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వధువు రీల్ కోసం అలా రోడ్డుపై వెళ్లిందట. రీల్స్ కోసం మీ ప్రియమైన వారు రోడ్డు పై భద్రత లేకుండా వెళ్తున్నారని క్యాప్షన్ పెట్టి, ఇలాంటి పిచ్చి పనులు షేయకండి అని క్యాప్షన్ జత చేశారు. సురక్షితంగా వాహనాలు నడపండి అంటూ పేర్కొన్నారు.
వీడియో మొదటి భాగంలో ఒక అమ్మాయి పెళ్లి దుస్తుల్లో, హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్నట్లు చూపించగా, రెండవ భాగంలో జూన్ 10 నాటి చలాన్ ఉంది. ఇది రెండు నిబంధనలను ఉల్లంఘించినందుకు ₹ 6,000 జరిమానాను చూపింది - ద్విచక్ర వాహనం నడపడం హెల్మెట్ లేకుండా, ₹ 1,000. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ₹ 5,000 జరిమానా విధిస్తున్నామని వారు చెప్పారు.
ఢిల్లీ పోలీసుల ట్వీట్‌పై ట్విట్టర్ వినియోగదారులు వెంటనే స్పందించారు. పోలీసుల చర్యలు, హాస్యాన్ని చూసి వారు ముగ్ధులయ్యారు. చాలా మంచి సందేశం ఇచ్చారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. "ఒక నేరం పరిణామాలను వివరించడానికి ఎంత అద్భుతమైన, వినూత్నమైన మార్గం" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.
