Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: 22 కేసులు నమోదు

ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న ఘటనలపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఢిల్లీలోని ఈస్ట్రన్ రేంజీలోనే ఐదు కేసులు నమోదుయ్యాయి.

Delhi Police detain 200 in connection with violence on Republic Day lns
Author
New Delhi, First Published Jan 27, 2021, 1:57 PM IST

న్యూఢిల్లీ: ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న ఘటనలపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఢిల్లీలోని ఈస్ట్రన్ రేంజీలోనే ఐదు కేసులు నమోదుయ్యాయి.

ఢిల్లీలోని కొన్ని చోట్ల మంగళవారం నాడు చోటుచేసుకొన్న ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇంటలిజెన్స్ అధికారులు, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.

తమ ర్యాలీలో అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడ్డారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలతో తమకు సంబంధం లేదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి.

అసాంఘిక శక్తులు ఈ ర్యాలీలో ఎలా ప్రవేశించాయి. దీని వెనుక ఎవరున్నారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాత్ బుధవారం నాడు మంగళవారం నాడు చోటు చేసుకొన్న ఘటనలపై స్పందించారు. సిదూ సిక్కు కాదు, అతను బీజేపీ కార్యకర్త అని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీతో సిదూ ఉన్న ఫోటో గురించి ఆయన ప్రస్తావించారు.

ఇది రైతుల ఉద్యమన్నారు. ఈ ఉద్యమంతో సంబంధం లేనివారంతా ఈ స్థలాన్ని వదిలివెళ్లాలని ఆయన కోరారు.ఇదిలా ఉంటే ఢిల్లీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios