Asianet News TeluguAsianet News Telugu

గ్రైండర్ యాప్ తో ‘గే’లకు వల.. 'సెక్స్‌టార్షన్' ముఠా గుట్టు రట్టు చేసిన ఢిల్లీ పోలీసులు...

ఆన్ లైన్ యాప్ ద్వారా ‘గే’లకు వలవేస్తూ.. మోసాలకు పాల్పడుతూ.. లైంగిక దాడులు చేస్తూ, డబ్బులు దండుకుంటున్న ముఠాలోని నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Delhi Police busted the Gay 'Sextortion' gang  Used To Blackmail Victim with Grindr app - bsb
Author
First Published May 27, 2023, 1:01 PM IST

ఢిల్లీ : ఆన్‌లైన్ డేటింగ్ యాప్ `గ్రైండ్ర్` ద్వారా బాధితులను ట్రాప్ చేసే రెండు 'గే సెక్స్‌టార్షన్ గ్యాంగ్'లను ఆగ్నేయ ఢిల్లీలో కనిపెట్టినట్టు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. నిందితులను అరుణ్ కుమార్ అలియాస్ చోటు (22), విశాల్ కోహ్లీ (24), రాజేష్ కుమార్ (42), అనుజ్ అలియాస్ బండా (21)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సరి కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్న సంగతి ఇటీవలే తమ దృష్టికి వచ్చిందన్నారు. నేరస్థులు `గ్రైండర్` యాప్‌లో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించి, బాధితులతో స్నేహపూర్వక చాటింగ్ చేస్తారు. 

ఆ తరువాత నిందితులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనమని బాధితులను ప్రలోభపెడతారు. వారు సూచించిన ప్రాంతాలకు రమ్మని ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత... వారిద్దరూ ఏకాంతంగాఉన్న సమయంలో మరికొంతమంది నిందితులు అక్కడికి వస్తారు. వారు బాధితుడి నగ్న వీడియోను తీస్తారు. దానిని అతని స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేస్తామని బెదిరిస్తారు.

Wrestlers Protest: రెజ్లర్లకు యోగా గురు రామ్‌దేవ్ మ‌ద్ద‌తు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫైర్

పరువు పోతుందన్న భయంతో, బాధితులు నిందితుల డిమాండ్‌లకు తలొగ్గి, వారు అడిగిన మొత్తాన్ని.. అకౌంట్లోకి బదిలీ చేస్తారు. ఇలాంటి ఓ సంఘటనలో సోషల్ మీడియా యాప్ `గ్రైండర్`లో రాహుల్ అనే వ్యక్తిని కలుసుకున్నట్టు ఓ ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపాడు. రాహుల్ బాధితుడిని ఏప్రిల్ 24న వినోబాపురి మెట్రో స్టేషన్‌లో కలవమన్నాడు. మెట్రో స్టేషన్‌కు చేరుకున్న రాహుల్ శ్రీనివాసపురి ప్రాంతంలో ఉన్న ఒక గదికి ఫిర్యాదుదారుని తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే ఉచ్చు బిగించారు ”అని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) రాజేష్ డియో చెప్పారు.

వీరిద్దరూ గది లోపలికి వెళ్లి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి వారి చర్యలను, ర్యాదుదారు వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించారు. "వారు అతని బట్టలు విప్పమని బలవంతం చేసారు. వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. బాధితుడు గౌరవనీయమైన వృత్తిలో ఉన్నందున, భయంతో తనను వదిలేయమని కోరాడు. 

నేరస్థులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో, బాధితుడు వారి డిమాండ్‌లకు కట్టుబడి, `ఫోన్‌పే`తో వారు అడిగిన మొత్తాన్ని బదిలీ చేసాడు" అని డిసిపి చెప్పారు. దర్యాప్తులో, కేసు నమోదు తర్వాత, ఘజియాబాద్‌లోని లోని ప్రాంతంలో ఇద్దరు నేరస్థులు అరుణ్, విశాల్‌లను పోలీసులు పట్టుకున్నారు. "రాజేష్ కుమార్‌ను షహబాద్ డెయిరీ ప్రాంతం నుండి పట్టుకున్నారు" అని అధికారి తెలిపారు. మరో సంఘటనలో, ఫిర్యాదుదారుడు `గ్రైండర్` డేటింగ్ యాప్‌లో నిఖిల్ అనే వ్యక్తితో జరిగిన ఎన్‌కౌంటర్‌ను వివరించాడు.

"యాప్ లో పరిచయం అయిన తరువాత, వారు వాట్సాప్లో కమ్యూనికేషన్ ప్రారంభించారు. మోహన్ ఎస్టేట్ మెట్రో స్టేషన్‌లో సాధారణ హుక్అప్ కోసం కలుసుకోవడానికి అంగీకరించారు. నిర్ణీత ప్రదేశానికి చేరుకున్న తర్వాత, అక్కడినుంచి ఆలీ విలేజ్ మాతా చౌక్‌కు రమ్మని నిఖిల్ తెలిపాడు. బాధితుడు అలాగే వెళ్లాడు" అని డియో చెప్పారు. 

"అక్కడికి చేరుకున్న తర్వాత, ముగ్గురు వ్యక్తులు చెక్క కర్రలు, రెండు కత్తులతో సడెన్ గా గదిలోకి ప్రవేశించారు. వారితో నిఖిల్ కూడా కలిసి  బాధితుడి మీద శారీరక దాడికి పాల్పడ్డారు. అతని ఇష్టానికి విరుద్ధంగా నోటితో సెక్స్ చేయమని బలవంతం చేశారు. అంతేకాకుండా, అతని నుండి రూ. 33,000 పే టీం ద్వారా దోచుకున్నారు" అని అధికారి తెలిపారు. "ఫిర్యాదుదారు మేరకు మెడికో-లీగల్ కేసు నిర్వహించబడింది. దర్యాప్తులో అనూజ్‌ను అరెస్టు చేశారు" అని అధికారి తెలిపారు, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. "రెండు కేసుల దర్యాప్తు మొత్తం కుట్రను బట్టబయలు చేస్తుంది" అని అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios