Asianet News TeluguAsianet News Telugu

మోదీకి ఆధ్యాత్మిక గురువునంటూ టోకరా

వీఐపీల పేర్లు చెప్పుకుని ప్రోటోకాల్ తోపాటు అనేక వెసులు బాట్లు పొందుతున్నకేటుగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. సీఎం బంధువును అంటూ ఒకరు.. మంత్రి మా దగ్గర బంధువు అంటూ ఇంకొకరు ఇలా వీఐపీల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీని కూడా అదేజాబితాలో చేర్చి అడ్డంగా దొరికిపోయాడో కేటుగాడు. 

Delhi Police arrests man for seeking favours by posing as Modi  spiritual guru
Author
Delhi, First Published Sep 28, 2018, 5:54 PM IST

ఢిల్లీ: వీఐపీల పేర్లు చెప్పుకుని ప్రోటోకాల్ తోపాటు అనేక వెసులు బాట్లు పొందుతున్నకేటుగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. సీఎం బంధువును అంటూ ఒకరు.. మంత్రి మా దగ్గర బంధువు అంటూ ఇంకొకరు ఇలా వీఐపీల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీని కూడా అదేజాబితాలో చేర్చి అడ్డంగా దొరికిపోయాడో కేటుగాడు. 

వివరాల్లోకి వెళ్తే పుల్కిత్‌ మహరాజ్‌ అలియాస్‌ పుల్కిత్‌ మిశ్రా అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అతగాడు వెళ్లిన ప్రతి రాష్ట్రంలోనూ వ్యక్తిగత లబ్ధి కోసం నరేంద్రమోదీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటూ వీఐపీ ప్రొటోకాల్‌ తోపాటు అనేక వెసులుబాట్లు పొందుతున్నాడు. 

మోదీ ఆధ్యాత్మిక గురువు అంటూ పుల్కిత్ మహారాజ్ చక్కెర్లు కొట్టడంతో ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. అసలు అతను ప్రధాని నరేంద్రమోదీకి ఆధ్యాత్మిక గురువా కాదా అని రహస్యంగా విచారణ చేపట్టారు. పీఎంవోను కూడా సంప్రదించారు ఢిల్లీ పోలీసులు. అయితే ప్రధాని మోదీకి, పుల్కిత్ కు ఎలాంటి సంబంధం లేదని పీఎంవో స్పష్టం చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.  

పుల్కిత్ మహారాజ్ పర్యటనలపై ఆరా తియ్యగా దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీయే కాకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును కూడా వాడుకున్నట్లు నిర్ధారించారు. ఓ జిల్లా కలెక్టర్, ఆస్పత్రి యాజమాన్యంకు లేఖలు రాసినట్లు గుర్తించారు.

 పుల్కిత్ మహారాజ్ అలియాస్ పుల్కిత్ మిశ్రా తాను నివసించేందుకు భద్రతా దళంతో కూడిన ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. తాను కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శినని ఆలేఖలో పేర్కొన్నారు. 

అంతేకాదు అనేకమంది ప్రముఖులతో ఫొటోలు దిగినట్లు నకిలీ చిత్రాలు సృష్టించాడు. అలాగే తనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిఫార్సు చేశారని వీఐపీ వైద్యం అందించాలని కోరుతూ ఓ వైద్యశాలను కూడా సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

నిందితుడు పుల్కిత్ మిశ్రా షహిబాబాద్ లో కథక్ డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ డ్యాన్స్ షోలకు హాజరయ్యే ప్రముఖలతో ఫోటోలు దిగి వాటి ఆధారంగా వెసులుబాట్లు పొందుతున్నాడని తెలిపారు. పుల్కిత్ మిశ్రా చేతిలో ఇంకెవరైనా మోసపోయారా అని తెలుసుకునేందుకు పోలీసులు ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios