Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు ముష్కరులు రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం చేసేందుకు ఢిల్లీలో సంచారిస్తున్నారంటూ మిలటరి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది.

Delhi Police arrested two terrorists
Author
Delhi, First Published Jan 25, 2019, 11:17 AM IST

గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు ముష్కరులు రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం చేసేందుకు ఢిల్లీలో సంచారిస్తున్నారంటూ మిలటరి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది.

దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు లక్ష్మీనగర్‌లో ఓ ఉగ్రవాదిని, బందీపోరాలో మురో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అబ్ధుల్ లతీఫ్ ఘనీ, అహ్మద్ భట్‌గా గుర్తించారు. ఢిల్లీలో దాడులకు భట్ రెక్కి నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఘనీ అనుచరులను అదుపులోకి తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి జమ్మూకశ్మీర్ వెళ్లారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర కదలికల దృష్ట్యా దేశరాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios