Asianet News TeluguAsianet News Telugu

డెలివరీ ఏజెంట్ కి కరోనా: క్వారంటైన్ లో 72 కుటుంబాలు!

 ఓ ప్రముఖ పిజ్జా స్టోర్ లో పనిచేస్తున్న పిజ్జా డెలివరీ ఏజెంట్ కరోనా పాజిటివ్ గా తేలాడు. ఈ సదరు పిజ్జా డెలివరీ ఏజెంట్ పిజ్జా అందించిన 72 కుటుంబాలను క్వారంటైన్ లో ఉండమని ఆదేశించారు.
Delhi Pizza Delivery Agent Tests COVID-19 positive, 72 Families Quarantined
Author
New Delhi, First Published Apr 16, 2020, 12:01 PM IST
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ పంజా ఇంకా కోరలు చాస్తూనే ఉండడంతో ప్రభుత్వం మరో 19 రోజులపాటు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. ఇలా లాక్ డౌన్ కొనసాగుతూ ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం ఇబ్బందులు పడకూడదని ఈ కామర్స్ సైట్లకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. 


ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ పర్మిషన్ ఇప్పుడు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఓ ప్రముఖ పిజ్జా స్టోర్ లో పనిచేస్తున్న పిజ్జా డెలివరీ ఏజెంట్ కరోనా పాజిటివ్ గా తేలాడు. 

ఈ పరిణామంతో ఒక్కసారిగా అలెర్ట్ అయినా ప్రభుత్వం... ఈ సదరు పిజ్జా డెలివరీ ఏజెంట్ పీజ్యాను అందించిన 72 కుటుంబాలను క్వారంటైన్ లో ఉండమని ఆదేశించారు. అంతే కాకుండా ఈ సదరు ఏజెంట్ ఇప్పటివరకు ఎవరెవరితో మాట్లాడాడు, ఏ స్టోర్ లను సందర్శించాడు ఇతర విషయాలను రాబడుతున్నారు. ముందుజాగ్రత్తగా ఈ సదరు డెలివరీ ఏజెంట్ తో కాంటాక్ట్ హైవ్స్టోరీ కలిగిన మరో 16 మంది డెలివరీ ఏజెంట్లను కూడా క్వారంటైన్ కి తరలించారు. 

ఆ డెలివరీ ఏజెంట్ వెళ్లిన ప్రాంతాల్లో ఆ పిజ్జా షాప్ లో పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించారు. ఈ డెలివరీ ఏజెంట్ కుటుంబ సభ్యులను వారెవరినైనా కలిశారు అనే కోణంలో కూడా పోలీసులు ముమ్మఫ దర్యాప్తు చేస్తున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios