Pilot Beaten : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళా పైలట్ ను కొంత మంది కొట్టారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకవచ్చి మరీ పిచ్చకొట్టుడుకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pilot Beaten : ఢిల్లీలోని ద్వారకలో ఒక మహిళా పైలట్ , ఆమె భర్తపై మూకదాడి జరిగింది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో కూడా ఈ విషయాన్ని గుర్తించింది. ఇండిగో తన పైలట్‌ను విధుల నుంచి తొలగించింది. విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అయిన మహిళ భర్తను కూడా విధుల నుంచి తొలగించారు. ఈ విషయమై నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అదే సమయంలో.. మహిళా పైలట్‌ను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అసలేం జరిగింది. వారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు . 10 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకోవడంతో పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతులపై ఆరోపణలున్నాయి. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 324, 342, బాల కార్మిక చట్టం, 75 జేజే యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో, గుంపులో ఉన్న వ్యక్తులు మహిళను పదేపదే చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది.

రెండు నెలల క్రితం

నిందితులైన దంపతులు ఢిల్లీలోని ద్వారకలోని సెక్టార్ 8 ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. పది ఏళ్ల బాలికను నిందిత దంపతులు.. వారి ఇంట్లో పనిమనిషిగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. నిందితులైన దంపతులు రెండు నెలల క్రితం బాధిత బాలిక తల్లిదండ్రులను సంప్రదించి వారిని ఇంటి పనికి తీసుకున్నారు. ఆ అమ్మాయి దంపతుల ఇంట్లో ఉండేది. ప్రధానంగా దంపతుల చిన్న బిడ్డను చూసుకునేందుకు బాలికను ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు.

క్రమంగా ఇతర ఇంటి పనులను కూడా ఆ చిన్నారితో చేయించుకునే వారని, ఆ క్రమంలో ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలున్నాయి. సరిగా పని చేయకపోతే.. లేదా చెప్పిన పని సరిగా చేయకపోతే.. బాలికను కొట్టేవారని, ఒకసారి బాధిత బాలికకు ఇస్త్రీ చేయమని డ్రేస్ ఇచ్చారని, అది సరిగ్గా చేయలేక.. వేడిచేసిన ఇనుప రాడ్ తో కాల్చారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని చూడటానికి ఆమె తల్లిదండ్రులు వచ్చారు. ఆ చిన్నారి చేతిపై, కాలిపై కాలిన గాయాలున్నాయి. బాలిక పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు చలించిపోయారు.

 పదేండ్ల చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొడతారా? ఇంత దారుణంగా చిత్రహింసలు పెడుతారా? అని కోపోద్రిక్తుతులయ్యారు. ఈ సమాచారాన్ని తమ బంధువులకు తెలియడంతో వారు కూడా వచ్చారు. ఈ క్రమంలో నిందిత దంపతులపైకి గొడవకు దిగారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. ఇంతలో కొంత మంది మహిళా పైలట్ ను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ఆ తర్వాత కొట్టడం ప్రారంభించారు. వారిని అడ్డుకునేందుకు పైలట్ భర్త ప్రయత్నించాడు. దీంతో అతడికి కూడా దేహశుద్ధి చేశారు.

Scroll to load tweet…

వారి దెబ్బలు తాళలేక అక్కడి నుండి తప్పించుకుని పరుగు తీశాడు. కాగా.. మహిళా పైలట్ ను మాత్రం స్థానికులు, బాధితురాలి బంధువులు దారుణంగా చితక్కొట్టారు. జట్టు పట్టుకుని ఈడ్చుకవెళ్లారు. విడిచిపెట్టండి అని ప్రాథేయపడ్డ బాలిక బంధువులు మాత్రం అసలు వదిలిపెట్టలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. మహిళా పైలట్, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇక చట్ట విరుద్ధంగా మైనర్ బాలికను పనిలో పెట్టిన ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. బాల కార్మిక చట్టం ప్రకారం.. పిల్లలను ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడం నేరం. ఈ విషయం తెలిసినా ఇప్పటికీ చాలామంది ఉల్లంఘిస్తున్నారు.