హోంవర్క్ చేయలేదని చిన్నారిని ఎర్రటి ఎండలో కాళ్లు , చేతులు కట్టేసి మెడపై పడిసిందో తల్లి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. 

హోంవర్క్ (home work) చేయలేదని చిన్నారికి పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది కన్నతల్లి. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రటి ఎండలో డాబాపై పడుకోబెట్టింది. ఎండ వేడికి (summer) తాళలేక చిన్నారి విలవిలలాడింది. పైన ఎండ, కింద డాబా వేడిని తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంది. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ఎర్రటి ఎండలో అలాగే వుంచింది. ఢిల్లీలో (delhi) జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు చిన్నారి బాధను వీడియో తీసి పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు (delhi police) తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హోంవర్క్ చేయలేదనే ఇలా చేశానని.. కేవలం ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది.