Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) మంగళవారం యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌లో ప్రత్యేకంగా మెట్రో రైలును ప్రారంభించింది. 

Azadi Ka Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్య్రం ల‌భించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) మంగళవారం (జనవరి 25) యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌లో ప్రత్యేకంగా మెట్రోను ప్రారంభించింది. రైలు ప్రారంభించిన వెంటనే ప్యాసింజర్ సర్వీసుల్లోకి చేర్చబడింది.

 ప్రజలలో జాతీయత, ఐక్యత భావ‌న‌ల‌ను, ఆలోచనను వ్యాప్తి చేయడానికి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్ర‌త్యేకంగా రూపొందించిన ఈ రైలును ప్రారంభించిన‌ట్టు DMRC అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు `ఆజాదీ కా అమృత మహోత్సవ్` వేడుక‌లు జ‌రిగిన‌ని రోజులు సేవలో కొనసాగుతుందని తెలిపారు. `అజాదీ కా అమృత మహోత్సవ్ - 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్యం` (AKAM) వేడుకల్లో జాతీయ నాయ‌కులు సేవ‌ల‌ను , వారి త్యాగాల‌ను స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్రం.

DMRC ప్ర‌త్యేకంగా రూపొందించిన ఈ రైలులో ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. ప్రత్యేక రైలు వెలుపల‌, లోప‌ల‌ భాగంలో ఫోటోగ్రాఫ్‌లు, స్వాతంత్య్ర నాయకుల నినాదాలతో అలంకరించబడింది. అలాగే భార‌త దేశ చరిత్ర, సంస్కృతిని ప్ర‌తిబింబించేలా రూపొందించారు.

జూలై 2021లో, DMRC తన AKAM స్మారక కార్యకలాపాలను వైలెట్ లైన్‌లోని లాల్ క్విలా మెట్రో స్టేషన్ నుండి ఒక ఎగ్జిబిషన్ రూపంలో ప్రారంభించి, ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే చారిత్రక వేదిక యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆగస్టు 15, DMRC తెలిపింది.

అంతేకాకుండా.. రైల్వే స్టేషన్‌లో AKAM థీమ్ తో ఈవెంట్ కార్నర్‌లు, మెట్రో స్టేషన్‌ల లోపల మరియు వెలుపల డిస్‌ప్లే ప్యానెల్‌లు, డిజిటల్ స్క్రీన్‌ల ఏర్పాటు. `AKAM` వేడుకల థీమ్ ఆధారిత ఆసక్తికరమైన సందేశాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్నారు.
 డీఎంఆర్సీ అధికారులు. 

 భారత స్వాతంత్య్ర సంగ్రామంలోని ప్రధాన ఘట్టాలు, ప్రఖ్యాత నాయకుల స్ఫూర్తిదాయకమైన సూక్తులు, వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్న భారతదేశ ప్రయాణం, సాంస్కృతిక ప్రవాసులు మొదలైనవాటిని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు 

ప్రజా రవాణా, మోటారు రహిత రవాణా, పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు DMRC ద్వారా ఎప్పటికప్పుడు సైక్లోథాన్, పిల్లల వర్క్‌షాప్, క్విజ్ మరియు డ్రాయింగ్ పోటీలు మొదలైన ఆన్‌లైన్ మరియు ఆన్‌లైన్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు DMRC తెలియజేసింది.