మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది.  ఇక నుంచి మెట్రోలో ప్రయాణించే వారు రెండు సీల్డ్ బాటిళ్లకు తమతో తీసుకెళ్లాడని అనుమతి ఇచ్చింది. 

మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తాజాగా తన విధానాలను మారుస్తూ.. మద్యం ప్రియులకు పుల్ జోష్ ను ఇచ్చే వార్త ఒకటి చెప్పింది. మెట్రోలో ప్రయాణం చాలా సౌకర్యవంతం.. సురక్షితం.. అదే సమయంలో ప్రయాణికులు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కానీ.. మెట్రోలో ప్రయాణించే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధం.. ఆ జాబితాలో మద్యం, పదునైన వస్తువులు, పేలుడు వస్తువులు( పెట్రోల్, డీజిల్, గ్యాస్ ), మరుణాయుధాలను తీసుకెళ్లడం నిషేధం. అయితే.. తాజాగా ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. 

ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో సీలు చేసిన రెండు మద్యం బాటిళ్లను తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చింది. Bemisal21 అనే నెటిజన్ మెట్రోలో మద్యం తీసుకెళ్లడంపై ప్రశ్నించగా.. దానికి ప్రతిస్పందనగా DMRC దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో దానికి సమాధానం ఇలా ఇచ్చింది. అవును.. మీరు ఢిల్లీ మెట్రోలో రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లవచ్చని బదులిచ్చింది. 


మెట్రో భద్రతకు బాధ్యత వహించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), DMRCల సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించండి. ఇంతకుముందు.. ఢిల్లీ మెట్రోలోని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో కాకుండా మరే ఇతర లైన్‌లో మద్యం రవాణా చేయడం నిషేధించబడింది. అయినప్పటికీ మెట్రో లోపల మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది ప్రయాణికులకు విజ్ఞప్తి.. DMRC తన ప్రకటనలో ప్రయాణ సమయంలో తోటీ ప్రయాణీకుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని అభ్యర్థించింది. మద్యం మత్తులో ప్రయాణీకులెవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటమని హెచ్చరించింది.