ఢిల్లీలో శుక్రవారం దారుణం జరిగింది. రెండు గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తికి 22 కత్తిపోట్లతో మరణించాడు. మృతుడి స్నేహితులిద్దరు కూడా గాయలపాలయ్యారు. మరో గ్యాంగులో ఓ బాలనేరస్తుడితో సహా ఇద్దరున్నారు. 

మృతుడిని నీరజ్ గా గుర్తించారు. గాయపడిన అతని ఇద్దరు మిత్రులను ముఖేష్, రాకేష్ లుగా గుర్తించారు. వీరిద్దరూ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు నిందితుల్లో ఇద్దరైన క్రిషన్, రవిలు ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. వీరిద్దరి ప్లేస్ లో ముఖేష్,రాకేష్ లను నియమించారు. ఇదే శతృత్వానికి కారణమయింది. ఇది మనసులో పెట్టుకున్న క్రిషన్, రవిలు ముఖేష్, రాకేష్ లపై దాడికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి ముఖేష్, రాకేశ్ తమ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఆఫీసునుండి బైటికి వచ్చాక ఈ దాడి జరిగింది. ఈ సమయంలో వీరితో పాటు వారి స్నేహితుడు నీరజ్ కూడా ఉన్నారు.

దారిలో, తమ స్నేహితుడితో కలిసి క్రిషన్, రవి వీరిని అడ్డుకున్నారు. రెండు గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది హింసకు దారి తీసింది. నిందితులు ముఖేష్, రాకేశ్‌లపై దాడి చేస్తుంటే..వారిని అడ్డుకోవడానికి నీరజ్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆ కోపమంతా నీరజ్ మీద చూపించి పొడిచి చంపారని చేసుకోవడానికి పోలీసులు తెలిపారు.

ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ నిందితులపై హత్య కేసు నమోదైందని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, బాలుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.