Asianet News TeluguAsianet News Telugu

 మరీ ఇంత బరితెగింపా ? అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త.. హతమార్చాలని ప్రియుడికి హుకుం..  కట్ చేస్తే..  

ప్రియురాలి భర్తను హత్య చేసి, ఆపై అతని మృతదేహాన్ని తగలబెట్టిన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నిందితుడికి మృతుడు భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Delhi man slits throat of lover's husband, burns body
Author
First Published Jan 8, 2023, 12:25 AM IST

ఆమెకి పెళ్లయింది. ఆమె భర్త కావాల్సిందల్లా  తెచ్చి ఇచ్చేవాడు. ఆమెను చాలా ప్రేమగా చూసుకునేవాడు. వారి సంసార జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. కానీ..  బాధ్యతతో ఉండాల్సిన ఆమె దారితప్పింది. కోరికలే గుర్రాలైతే ఇక ఆపేదెవరు అన్నట్టు.. ఆమె తన భర్త స్నేహితుడితో  అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కన్నుగప్పి ప్రియుడుతో జల్సాలు చేసింది. కానీ.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చాలని భావించింది. ఈ క్రమంలో తన భర్తను హతం చేయాలని ప్రియుడిని ఒత్తిడి చేసింది. దీంతో ప్రియసి మాటను కాదనలేక.. ఆమెను దూరం చేసుకోవడం ఇష్టం లేక ప్రియుడు దారుణానికి ఒడిగట్టారు .

పథకం ప్రకారం.. ప్రియురాలి భర్తకు  నిర్మానుష్యా ప్రాంతానికి తీసుకెళ్లి.. పుల్ గా మద్యం తాగించాడు. అత్యంత దారుణంగా దాడి చేసి గొంతుకోసి హతమర్చాడు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ప్రియురాలి భర్త శవాన్ని తగలబెట్టాడు. అంత ఫ్లాన్ ప్రకారమే జరిగిందని భావించారు. అయితే..  తీగ లాగితే డొక్కంతా కదిలినట్టు.. సీసీ ఫుటేజ్ లో ద్వారా  అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆరా తీస్తే.. అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది.  

ఈ ఘటన ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అరెస్టయిన నిందితుడిని మునీషుద్దీన్ (27)గా గుర్తించారు. ఘటన జరిగిన రోజున నిందితుడు మునీషుద్దీన్ మద్యం సేవించి రషీద్‌ను రామ్‌ఘాట్‌లోని ఓ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడ మద్యం సేవించిన మునీషుద్దీన్ ముందుగా రషీద్ కడుపులో పొడిచి, ఆపై గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టారు.  ప్రస్తుతం రషీద్ భార్యను విచారిస్తున్నామని, ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

 వివరాల్లోకెళ్తే..  మృతుడు మునీషద్దీన్‌, హంతకుడు రషీద్‌ ఇద్దరు పంబ్లింగ్‌, ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో వారు ఒకరి ఇళ్లను సందర్శించడం కూడా ప్రారంభించారు. ఈ సమయంలో రషీద్‌ భార్యతో మునీషద్దీన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. రషీదు కన్నుగప్పి వారిద్దరూ కలుసుకునే వారు. చేటాపటాలు వేసుకుని తిరిగేవారు. కానీ వారి అక్రమ సంబంధానికి రషీద్ అడ్డుగా ఉన్నాడనీ.. అతని అడ్డు తొలగించాలని వారిద్దరూ భావించారు. ఈ క్రమంలో జనవరి 2న వజీరాబాద్ పరిధిలోని రామ్ ఘాట్‌కు రషీద్‌ను మునీషద్దీన్‌ తీసుకెళ్లాడు. అనుకున్న విధంగా.. రషీదుకు పుల్ గా తాగించాడు. మద్యం మత్తులోకి జారుకున్న రషీద్‌పై మునషద్దీన్ కత్తితో దాడి చేశాడు. కత్తితో పొడిచి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం.. హత్య ఘటన బయటపడవద్దని మృతదేహాన్ని తగులబెట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

మరోవైపు 90 శాతం కాలిపోయిన మృతదేహాన్ని గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు లో భాగంగా.. సీసీటీవీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు మునీషద్దీన్‌ను గుర్తించారు. తెల్లవారుజామున రోహిణి సెక్టార్ -16 సమీపంలోకి  అతడు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ట్రాప్‌ చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios