ఓ వ్యక్తి స్నేహానికే ద్రోహం చేశాడు. స్నేహితుడికి తెలియకుండా అతని భార్యపై కన్నేశాడు. తొలుత పరిచయం పెంచుకున్నాడు. తర్వాత దానిని వివాహేతర సంబంధంగా మార్చుకున్నాడు. ఆమెను తన భర్తను వదిలేసి తన వద్దకు రావాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన విక్కీ అనే వ్యక్తి రమేష్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఓ కేసులో ఇరుక్కున్న రమేష్.. జైల్లో ఉన్నాడు. స్నేహితుడు జైల్లో ఉన్న సందర్భాన్ని విక్కీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.  రమేష్‌ భార్యతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో స్వర్ణజయంతి విహార్‌లోని పుట్టింట్లో ఉన్న ఆమె వద్దకు వెళ్లి తనతో వచ్చేయాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తుపాకీతో తన ఛాతీకి గురిపెట్టి కాల్చుకున్నాడు. విక్కీ గొడవకు దిగడంతో ఢిల్లీ పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసిన బాధితురాలు ఓ వ్యక్తి తుపాకీతో తనను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి విక్కీ ఛాతీపై బుల్లెట్‌ గాయాలతో పడిఉన్నాడు. కాగా నిందితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.