లాక్ డౌన్ లో భార్య పోరు భరించలేక.. భర్త ఏంచేశాడంటే..

ఓ వ్యక్తి అయితే.. ఏకంగా భార్య పోరు భరించలేక ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Delhi man hanging from flyover wanted to kill himself, cops save him

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం పలు దేశాల్లో లాక్ డౌన్ విధించారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే.. వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి.. ఎక్కువగా ఎవరూ ఆ సాహసం చేయడం లేదు. అయితే.. ఈ లాక్ డౌన్ లో భార్యభర్తల గొడవలు మాత్రం పీక్స్ కి చేరుకుంటున్నాయి.

మొన్నటికి మొన్న చైనాలో లాక్ డౌన్ కారణంగా భార్యభర్తలు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. లాక్ డౌన్ లో గృహహింస పెరిగిపోయిందనే వార్తలు వచ్చాయి. తాజాగా.. మేము భార్య బాధితులమంటూ కొందరు ముందుకు వస్తున్నారు.

ఓ వ్యక్తి అయితే.. ఏకంగా భార్య పోరు భరించలేక ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకొవాలని ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన 32 ఏళ్ళ వ్యక్తి ఫ్లైఓవర్ నుండి దూకే క్రమంలో ఫ్లైఓవర్ సిమెంట్ రెయిలింగ్ ను పట్టుకుని వేలాడుతూ సహాయం కోసం అర్ధించాడు. దీంతో ప్రాణభయంతో ఉన్న అతడిని పోలీసులు రక్షించారు.

ఫ్లైఓవర్ సిమెంట్ రెయిలింగ్ ను పట్టుకుని వేలాడుతున్న అతడిని చూసిన పోలీసులు అక్కడికి చేరుకొని.. అతడు కింద పడితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఓ చెత్త లారీని అతడు కింద పడే దగ్గర పెట్టారు. ఇక అంతలోపే పైనున్న ఇద్దరు పోలీసులు అతన్ని పైకి లాగే కాపాడారు. 

అనంతరం అతన్ని పోలీసులు ప్రశ్నించగా.. తన భార్య తరుచుగా వేధిస్తుందని అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నాడు. ప్రస్తుతం అతను నిరుద్యోగి కావడంతో ఏదో ఒక పనిచేసుకోవాలని భార్య తరుచుగా గొడవ పడుతుండడంతో ఆత్మహత్య యత్నానానికి పాల్పడినట్లు అతను తెలియచేసాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios