Asianet News TeluguAsianet News Telugu

దారుణం : పెళ్లైన యేడాదికే.. భార్య మీద కాల్పులు జరిపిన భర్త... !

మంగోల్‌పురిలోని యు-బ్లాక్‌లో నివసిస్తున్న నిందితుడు మోహిత్ తో మోనిక వివాహం సంవత్సరం క్రితం వివాహం అయింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో మోనిక తన తల్లిదండ్రులతో కలిసి మంగోల్‌పురిలోని ఎస్-బ్లాక్ లో  నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Delhi Man Fires At Wife For Filing Complaint Against Him, Arrested : Cops
Author
Hyderabad, First Published Aug 19, 2021, 9:30 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీ మంగోల్ పురిలో దారుణం జరిగింది. తన మీద కేసు పెట్టిందన్న కోపంతో ఓ భర్త భార్యమీద కాల్పులు జరిపాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన సదరు భర్తను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 

మంగోల్‌పురిలోని యు-బ్లాక్‌లో నివసిస్తున్న నిందితుడు మోహిత్ తో మోనిక వివాహం సంవత్సరం క్రితం వివాహం అయింది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో మోనిక తన తల్లిదండ్రులతో కలిసి మంగోల్‌పురిలోని ఎస్-బ్లాక్ లో  నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉదయం 9 గంటలకు మోనిక పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త తనతో గొడవపడుతున్నాడని, భర్తపై ఫిర్యాదు చేసింది. అయితే తానిప్పుడు ఇంట్లో లేనని చెప్పింది. ఆ తరువాత మోనిక మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భర్తపై ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

ఆమె ఫిర్యాదుతో వెంటనే పోలీసులు మోహిత్‌కు ఫోన్ చేశారు. మోహిత్ మాట్లాడుతూ తాను కన్నాట్ ప్లేస్ లో ఉన్నానని, సాయంత్రానికి వస్తానని చెప్పాడు. అయితే సాయంత్రం నాలుగు గంటలకు మోనిక పోలీసులకు ఫోన్ చేసి తన భర్త వచ్చాడని తెలిపిందని ఒక సీనియర్ అధికారి అన్నారు.

వెంటనే అక్కడికి కొంతమంది పోలీసులను ఆ ప్రదేశానికి పంపారు. అప్పటికే  అక్కడ మోహిత్ చేతిలో తుపాకీతో కనిపించాడు. మోనిక అరుస్తూ ఉంది. మోనిక కేకలు విన్న ఇరుగు పొరుగువారు రావడం.. మోహిత్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

మోహిత్ మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరాడు. దానికి అంగీకరించకపోవడంతో తన మీద కాల్పులు జరిపాడని మోనిక పోలీసులకు సమాచారం అందించారు. కాల్పుల నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ (ఔటర్) పర్వీందర్ సింగ్ తెలిపారు.

నిందితుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని, తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు మోహిత్ కు గన్ ఎలా వచ్చిందో తెలుసుకునే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించామని సింగ్ చెప్పారు. మోహిత్ కు ప్రస్తుతం ఉద్యోగం లేదు. మోనిక ఎం.కామ్ ఎగ్జామ్స్ రాస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios