Delhi Crime News:  ఢిల్లీలో దారుణం జ‌రిగింది.ప్రేమించిన యువ‌తిని కత్తితో పొడిచి.. యాసిడ్ తాగి ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు ఓ యువ‌కుడు.  ఆ నిందితుడికి ఇటీవలే మరొక మహిళతో వివాహం జరగడం గ‌మ‌నార్హం. ఈ దారుణం పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో జ‌రిగింది. 

Delhi Crime News: మ‌హిళ‌ల‌, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం.. ప్ర‌భుత్వం ఎన్నో క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుక‌వ‌చ్చినా.. వారిపై జ‌రుగుతోన్న‌ అఘాత్యాలను అడ్డుక‌ట్ట వేయలేక పోతున్నాయి. నిత్యం ఏదోక చోట‌ అవమానాల్లో కూరుకుపోతూ, అన్యాయానికి, దాడుల‌కు గురవుతున్నారు. హత్యలకూ అత్యాచారాలకూ బలవుతునే ఉన్నారు. తాజాగా.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అమానవీయకర సంఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. 

ఓ యువ‌కుడు తాను ప్రేమించిన యువ‌తి త‌న‌ని పట్టించుకోవడం లేద‌నీ, త‌న‌ని దూరం పెడుతుంద‌ని.. ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెపై ప్లాన్ ప్ర‌కారం వెంబడించి.. కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. అనంత‌రం ఆ యువ‌కుడు యాసిడ్ తాగి ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ చేసుకుంది. అయితే.. నిందితుడికి ఇటీవలే మరొక యువ‌తితో వివాహం జరగ‌డం గ‌మ‌నార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన యువ‌తి, నవీన్ కుమార్ అనే యువ‌కుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కానీ, ఇత‌ర కార‌ణాల వల్ల .. కుమార్ ఇటీవ‌ల మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమం ప్రేమించిన యువ‌తి త‌న‌ని మ‌రిచిపోవాల‌ని కోరిందని, అయితే.. కుమార్ మాత్రం త‌మ‌ సంబంధాన్ని కొనసాగించాలని పట్టుబట్టాడు. కానీ ఆ యువ‌తి దానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కూమార్ ను దూరం పెట్టింది. అత‌ని కాల్స్, మెసెజ్స్ ల‌ను రిప్లే ఇవ్వ‌డం మానివేసింది. దీంతో ఆ యువ‌తిపై కోపం పెంచుకున్నాడు. ప్రియురాలు పట్టించుకోవ‌డం మానివేసింద‌నీ ఆమెపై క‌త్తితో దాడికి యత్నించాడు.

గ‌త‌ శుక్రవారం కంప్యూటర్‌ క్లాస్ నుంచి స‌ద‌రు యువ‌తిని వెంబడించి కత్తితో పొడిచాడు. అనంత‌రం తాను యాసిడ్ తాగి ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశారు. దాడి జ‌రిగిన వెంట‌నే ఆ యువ‌తిని ఆస్ప‌త్రికి తరలించారు. దీంతో ఆ యువ‌తి ప్రాణాపాయం నుంచి బ‌య‌టప‌డింది. ఆమెను తర్వ‌త‌ రోజు డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం నిందితుడు దీనదయాళ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 కింద రంహోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.