సారాంశం

Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరుల రూ.52 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో మనీష్ సిసోడియా, అమన్‌దీప్ సింగ్ ధాల్, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పేర్లు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

Delhi excise case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరుల రూ.52 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో మనీష్ సిసోడియా, అమన్‌దీప్ సింగ్ ధాల్, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పేర్లు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసు క్ర‌మంలోనే సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. మాజీ ఉప ముఖ్య‌మంత్రి మనీష్ సిసోడియా తదితరులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఆధారిత మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీష్ సిసోడియా, ఆయన భార్య, మరికొందరు నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తెలిపింది.

మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియాకు చెందిన రెండు ఆస్తులు, మరో నిందితుడు రాజేశ్ జోషి (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్) భూమి/ఫ్లాట్, గౌతమ్ మల్హోత్రాకు చెందిన భూమి/ఫ్లాట్ సహా ఇతర స్థిరాస్తులు (రూ.7.29 కోట్లు) జప్తు చేయాలని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. మనీష్ సిసోడియాకు చెందిన రూ.44.29 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.11.49 కోట్లు) తదితర ఆస్తులతో కలిపి రూ.16.45 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.52.24 కోట్లు అని ఈడీ తెలిపింది.

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను ఈ కేసులో ఈడీ ఇప్పటికే అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కార్టలైజేషన్ ను అనుమతించిందనీ, దాని కోసం లంచాలు ఇచ్చిన కొంతమంది డీలర్లకు అనుకూలంగా ప‌నిచేశార‌ని ఈడీ, సీబీఐ ఆరోపిస్తున్నాయి. అంత‌కుముందు, ఢిల్లీ ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన మ‌ద్యం పాల‌సీని వెన‌క్కి తీసుకుంది. ఈ విధానాన్ని రద్దు చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేయడంతో ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించి కేసు న‌మోదుచేసింది.