ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన  రెండు  అనుబంధ చార్జ్‌షీట్‌లను కోర్టు పరిగణలోకి తీసుకుంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో రెండు అనుబంధ చార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్లను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇందులో ఒక చార్జ్‌షీట్‌లో ఈడీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై అభియోగాలు మోపింది. మరో చార్జ్‌షీట్లలో అరుణ్ పిళ్లై, అనుదీప్ ధాల్‌లపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మే 10వ తేదీన జరగనుంది. ఇక, ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ మొత్తం మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఇటీవల మరోసారి పొడిగించిన సంగతిత తెలిసిందే. మే 28 వరకు సిసోడియా కస్టడీని పొడగిస్తూ కేసులు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈ కేసులో మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 9న అరెస్టు చేసింది.