ఢిల్లీ లిక్కర్ స్కాంలో సోమవారంనాడు అరవింద్ సింగ్ ను ఇవాళ అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సోమవారం నాడు మరో అరెస్ట్ చోటు చేసుకుంది. అరవింద్ సింగ్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరవింద్ సింగ్ ఓ న్యూస్ చానెల్ లో ఉద్యోగిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ. 17 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా దర్యాప్తు సంస్థులు గుర్తించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల్లో ఒకరి నుండి వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్న కంపెనీకి నగదును బదిలీ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2021 జూన్, 2022 జూన్ లో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో వచ్చిన ముడుపులను ఆప్ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
