Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ అంజలీ సింగ్ ఘటన : ప్రమాద సమయంలో కారులో ఉన్నది ఐదుగురు కాదు.. నలుగురే...

ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్,  మిథున్ ఉన్నారు. అయితే దీపక్ ప్రమాద సమయంలో కారులో లేడని పోలీసులు తెలిపారు. 

Delhi Horror, only four, not five people in the car at the time of accident, that dragged woman for 13 km
Author
First Published Jan 6, 2023, 10:03 AM IST

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని ఢీకొట్టి 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారులో ఐదుగురు కాదు నలుగురు వ్యక్తులు మాత్రమే ఉన్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇంతకుముందు కారు నడుపుతున్నట్లు భావించిన వ్యక్తి ప్రమాదం సమయంలో కారులో లేడని తెలిపారు. జనవరి 1 తెల్లవారుజామున జరిగిన అంజలి సింగ్ మరణం ఘటనపై జరుపుతున్న దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. 

ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్ ఉన్నారు. మరో ఇద్దరు కారులో ఉన్న వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నించారని, వారి నేరాన్ని కప్పిపుచ్చడానికి సహాయం చేశారని ఆరోపించారు. కారు యజమాని అశుతోష్‌ను నిన్న అరెస్టు చేశారు. ఏడో నిందితుడు అంకుష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

అంజలీ సింగ్ మీదికి కారు దూసుకెళ్లిన ప్రమాదం జరిగిన సమయంలో అమిత్ ఖన్నా కారు నడుపుతున్నప్పుడు. తాము ముందుగా ఊహించనట్టు కారు నడుపుతుంది దీపక్ కాదని పోలీసులు చెప్పారు. దీపక్ ఖన్నా ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. అయితే, అమిత్ ఖన్నా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో ఈ నేరాన్ని తనపై వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

మెదడులో కొంత భాగం మిస్సింగ్, బయటకు వచ్చిన పక్కటెముకలు: అంజలి శవపరీక్షలో షాకింగ్ విషయాలు..

న్యూ ఇయర్ వేడుక ముగించుకుని అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా తెల్లవారుజామున 2 గంటల తర్వాత కారు ఆమె స్కూటీని ఢీకొట్టింది. అంజలి కాలు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమెను అలాగే కారు ఈడ్చుకెళ్లింది. ఆమె అరిచి, కేకలు వేసింది.. కానీ కారు ఆగలేదు. కారు చక్రాల కింద ఆమె చేతులు, కాళ్లు కనిపిస్తున్నవారు వారించే ప్రయత్నం చేసినా కారు ఆగలేదు. మద్యం మత్తులో ఉన్న కారులోని వ్యక్తులు అలాగే గంటకు పైగా వాహనం నడిపారు. దీంతో తీవ్ర చిత్రహింసతో అంజలి మృతిచెందింది. చివరికి గంట తరువాత కారు ఆపినప్పుడు మృతదేహం కిందపడిపోయింది.

సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత, కారులోని వ్యక్తులు కారును తిరిగి దాని యజమాని అయిన అశుతోష్ దగ్గరకు తెచ్చి వదిలేశారు. ఆ తరువాత ఆటోలో పారిపోయినట్లు సెక్యూరిటీ ఫుటేజీ వెల్లడించింది. అంజలి శరీరం మీద కనీసం 40 బాహ్య గాయాలున్నట్లు తేలింది. ఈ గాయాలతోనే అంజలి మరణించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ఈ ప్రమాదంలో ఆమె చర్మం ఒలిచినట్టయ్యింది. ఆమె పక్కటెముకలు వెనుక భాగం నుండి బయటపడ్డాయి, ఆమె పుర్రె బేస్ ఫ్రాక్చర్ అయ్యింది. మెదడులోని కొంత భాగం మిస్ అయ్యింది. ఆమె తల, వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios