Asianet News TeluguAsianet News Telugu

ఢీల్లీ లిక్కర్ స్కాం: బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు బెయిల్ మంజూరు

ఢిల్లీ  లిక్కర్  స్కాంలో   బోయినపల్లి  అభిషేక్  రావు, విజయ్ నాయర్ లకు  ఢిల్లీ హైకోర్టు  సోమవారంనాడు  బెయిల్  మంజూరు  చేసింది. 

Delhi high Court grants Bail to Bowenpally Abhishek rao
Author
First Published Nov 21, 2022, 2:15 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీ  లిక్కర్  స్కాంలో  బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు  ఢిల్లీ హైకోర్టు  సోమవారంనాడు  బెయిల్  మంజూరు  చేసింది.  సీబీఐ  ప్రత్యేక  కోర్టు  ఆదేశాలను  నిందితులు  ఢిల్లీ  హైకోర్టులో సవాల్  చేశారు. దీంతో  వీరిద్దరికి  ఢిల్లీ  హైకోర్టు  సోమవారంనాడు  బెయిల్  మంజూరు  చేసింది.  

ఢిల్లీ  లిక్కర్  స్కాంలో  బోయినపల్లి  అభిషేక్ రావు,  విజయ్  నాయర్ లను  ఈడీ  అధికారులు కస్టడీలోకి  తీసుకుని  విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్  స్కాం  కేసులో దక్షిణాది కేంద్రంగా  ఈడీ, సీబీఐ  అధికారులు  సోదాలు  నిర్వహించారు. తొలుత  సీబీఐ  అధికారులు  ఈ  విషయమై కేసు  నమోదు  చేసి దర్యాప్తు  చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  పలు  దఫాలుగా  ఈడీ, సీబీఐ  అధికారులు సోదాలు  నిర్వహించిన  విషయం  తెలిసిందే. 

హైద్రాబాద్ కు  చెందిన  అరుణ్  రామచంద్రన్  పిళ్లైపై సీబీఐ  అధికారులు  కేసు నమోదు  చేశారు.  ఈ  కేసు ఆధారంగా  ఈడీ  అధికారులు రంగంలోకి దిగారు.మనీ లాండరింగ్  జరిగిందనే  విషయమై ఈడీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు. ఇప్పటివరకు  సేకరించిన  సమాచారం  ఆధారంగా    ఈడీ  అధికారులు  సోదాలు  చేశారు.  

హైద్రాబాద్  కు  చెందిన  శరత్  చంద్రారెడ్డి, వినయ్  బాబులను  ఈడీ అధికారులు  ఈ నెల  10వ  తేదీన  అరెస్ట్  చేశారు. దాదాపుగా  10  రోజులుగా  ఈడీ  అధికారులు  వీరిద్దరిని  కస్టడీలోకి  తీసుకొని  విచారించారు. ఇవాళ్టితో  వీరిద్దరి  విచారణ ముగిసింది.  మరో వైపు   విజయ్ నాయర్ , బోయినపల్లి  అభిషేక్ రావులను  కూడ ఈడీ  అధికారులు  ఈడీ  అధికారులు  కస్టడీలోకి  తీసుకుని  విచారిస్తున్నారు. మరో  వైపు  హైద్రాబాద్ కు  చెందిన  చార్టెడ్  అకౌంటెంట్  సహా  అరుణ్ రామచంద్ర పిళ్లైలకు  కూడా ఈడీ  అధికారులు  నోటీసులు  పంపిన  విషయం  తెలిసిందే. 

శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు  డిసెంబర్  5 వరకు  రిమాండ్

ఢిల్లీ  లిక్కర్  స్కాంలో  శరత్ చంద్రారెడ్డి,  వినయ్  బాబులకు  జ్యూడిషీయల్ రిమాండ్  విధించింది  సీబీఐ  కోర్టు. ఈ  ఏడాది  డిసెంబర్  5వ  తేదీ  వరకు  రిమాండ్  విధిస్తూ  కోర్టు  ఆదేశాలు  జారీ  చేసింది.  ఈ  ఇద్దరిని తీహర్  జైలుకు  తరలించనున్నారు  ఈడీ  అధికారులు.   తీహార్  జైలులో  వీరిద్దరికి  తీహర్  జైలులో  ధరించేందుకు వీలుగా   ఉన్ని  దుస్తులు  ధరించేందుకు  అనుమతివ్వాలని  నిందితుల  తరపు న్యాయవాది  కోర్టును  కోరారు . 
ఈ  నెల  10 వ   తేదీన  వీరిద్దరిని ఈడీ  అధికారులు  అరెస్ట్  చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios