కరోనాతో పాటు న్యూమోనియా: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్యం విషమం

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయనకు కరోనా వైరస్ నిర్థారణ అయిన తర్వాత , తాజాగా నిమోనియా కూడా సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సత్యేంద్రను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి మ్యాక్స్‌వెల్ ఆసుపత్రికి తరలించనున్నారు

delhi health minister satyendar jains condition worsens moved to another covid-19 hospital

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయనకు కరోనా వైరస్ నిర్థారణ అయిన తర్వాత , తాజాగా నిమోనియా కూడా సోకినట్లు వైద్యులు తెలిపారు.

దీంతో సత్యేంద్రను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి మ్యాక్స్‌వెల్ ఆసుపత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారు.

మరోవైపు ఫ్లాష్మా థెరపీ ద్వారా సత్యేంద్ర జైన్‌కు కరోనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సత్యేంద్ర జైన్ హైఫీవర్‌తో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంతో అనుహ్యంగా ఇబ్బంది పడ్డారు.

Also Read:24 గంటల్లో ఇండియాలో 13,586 కరోనా కేసులు: కోవిడ్‌తో12,573 మంది మృతి

55 ఏళ్ల సత్యేంద్ర జైన్‌ మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో హాస్పిటల్‌లో చేరారు. కరోనా లక్షణాల కనిపిస్తుండటంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా మొదట నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మరోవైపు సత్యేంద్ర ఆసుపత్రిలో చేరడంతో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios