ఢిల్లీ హైకోర్టు ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. 

ఢిల్లీ హైకోర్టు ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. బాలిక 18 ఏళ్లలోపు వయస్సున్నప్పటికీ తన భర్తతో కలిసి జీవించవచ్చని పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం అటువంటి సందర్భాలలో వర్తిస్తుందనే వాదనలను కోర్టు తోసిపుచ్చింది. బాలలు దోపిడీకి గురికాకుండా రక్షించడమే చట్టం యొక్క లక్ష్యం అని పేర్కొంది. ముస్లిం ఆచారాల ప్రకారం 2022 మార్చిలో వివాహం చేసుకున్న ముస్లిం జంటకు జస్టిస్ జస్మీత్ సింగ్ బెంచ్ రక్షణ కల్పించింది.

ప్రస్తుత కేసులో పిటిషనర్లు ప్రేమలో ఉన్నారని.. ముస్లిం వ్యక్తిగత చట్టాల ప్రకారం పెళ్లి చేసుకున్నారని.. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పరచుకున్నారని కోర్టు పేర్కొంది. ‘‘పిటిషనర్లు భార్యాభర్తలుగా జీవిస్తున్నారని స్టేటస్ రిపోర్టులో కూడా స్పష్టమైంది. వారి వివాహానికి ముందు వారు లైంగిక సంబంధం కలిగి ఉన్నారని ధృవీకరణ లేదు. వాస్తవానికి వారు 2022న మార్చి 11న వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నారని స్టేటస్ రిపోర్టు సూచిస్తోంది’’ అని కోర్టు పేర్కొంది.

పిటిషనర్లు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నందున ఒకరి కంపెనీని మరొకరు తిరస్కరించలేమని కోర్టు పేర్కొంది. పిటిషనర్లు వేరు చేయడం వల్ల బాలికకు, ఆమె పుట్టబోయే బిడ్డకు మరింత గాయం అవుతుందని.. పిటిషనర్ యొక్క ఉత్తమ ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం అని పేర్కొంది. భర్తతో చేరేందుకు బాలికకు స్వేచ్ఛ ఉందని కోర్టు తీర్పునిచ్చింది.

ఇక, తన తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించారని, మొదట తన భర్తపై ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసి, ఆపై అత్యాచారం, పోక్సో సెక్షన్లు జోడించారని బాలిక పిటిషన్‌లో పేర్కొంది.