Asianet News TeluguAsianet News Telugu

అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ పేరు, వాయిస్, పిక్ ను ఉపయోగించకూడదు: ఢిల్లీ హైకోర్టు

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన పేరు, ఇమేజ్, వాయిస్ కు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం .. అమితాబ్ బచ్చన్ సుప్రసిద్ధ వ్యక్తి అని, అతని పేరు,వాయిస్ ను అనుమతి లేకుండా ఉపయోగించరాదని పేర్కొంది. 

Delhi HC says Amitabh Bachchan's name, voice, pic can't be used without permission
Author
First Published Nov 25, 2022, 1:35 PM IST

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమితాబ్ బచ్చన్ వాయిస్,పేరు, ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

తాజాగా తన అనుమతి లేకుండా తన మేధో సంపత్తిని వాడుకుంటున్నారంటూ అమితాబ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా వేశారు. అమితాబ్ తన పిటిషన్‌లో తన పేరు, ఇమేజ్, వాయిస్, వ్యక్తిత్వ లక్షణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. పలు సంస్థలు తన పేరు, ఇమేజ్, వాయిస్, వ్యక్తిగత లక్షణాలను అనుమతి లేకుండా కమర్షియల్‌గా వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు.

వాస్తవానికి.. ఫేక్  కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) లాటరీ స్కామ్‌లో అమితాబ్ బచ్చన్ ఫోటోగ్రాఫ్‌లు, వాయిస్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలను అరికట్టాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని కోరారు. ఇది తన సెలబ్రిటీ హోదాకు విరుద్ధమని అన్నారు. అటువంటి పరిస్థితిలో కోర్టు నిషేధాన్ని జారీ చేయాలని కోరారు. 

ఢిల్లీ హైకోర్టులో అమితాబ్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా  అమితాబ్  తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ.. KBC లాటరీ రిజిస్ట్రేషన్ , లాటరీ విజేత కైసే బనే కౌన్ బనేగా కరోడ్‌పతికి కాపీ అని అన్నారు. ఎక్కడ చూసినా అమితాబ్ బచ్చన్ చిత్రాలేననీ, అక్టోబరు నెలాఖరులో ఈ విషయం తమకు తెలిసిందనీ, ఈ లాటరీ కూడా ఒక రకమైన స్కామ్ అన్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ చిత్రం ఉపయోగిస్తున్నారని తెలిపారు. అలాగే.. అమితాబ్ బచ్చన్ ఫేక్ వాయిస్ కూడా ఉపయోగిస్తున్నారని తెలిపారు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా మాట్లాడుతూ..బాలీవుడ్ చక్రవర్తి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే తన వాయిస్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని , నటుడి అనుమతి లేకుండానే నటుడి సెలబ్రిటీ హోదాను వాడుకుంటున్నారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల నటుడి పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడ్డారు.

టెలికాం శాఖకు నోటీసులు జారీ 

ఈ దావా విచారణ అనంతరం.. టెలికాం శాఖ అధికారులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అమితాబ్ బచ్చన్వాయిస్ ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అందించి..  ప్రచార హక్కులను ఉల్లంఘించినందుకు టెలికాం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖపై దావా వేశారు. లింక్‌లు, వెబ్‌సైట్‌ల జాబితాను తీసివేయడానికి ఆదేశాలను కోరింది.  


KBC 14వ సీజన్‌కు హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్    

హిందీ చిత్రాలలో తన అద్భుతమైన నటనతో అనేక జాతీయ అవార్డులను గెలుచుకున్న అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి.. KBC ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లో 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆయన  కౌన్ బనేగా కరోడ్‌పతి యొక్క మొత్తం 12 సీజన్‌లను హోస్ట్ చేసారు. ఇప్పుడు సంఖ్యల పరంగా 14వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లన్నీ కూడా సూపర్‌హిట్ అయ్యాయి.  

అమితాబ్ బచ్చన్ కూడా చాలా సినిమాల్లో పాటలు పాడారు. 'లావారిస్' సినిమాలో పాడిన 'మేరే ఆంగ్నే మే తుమ్హారా క్యా కామ్ హై...' పాట బాగా పాపులర్ అయింది. దీంతో పాటు అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో 'జాదూగర్' చిత్రంలోని 'పదోసన్ అప్నీ ముర్గీ కో రఖ్నా సంభాల్' పాట కూడా బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్‌లో ‘నట్వర్‌లాల్‌’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌తో పాడిన పాట నేటికీ పాపులరే. 2007లో అమితాబ్ బచ్చన్, జియా ఖాన్ నటించిన 'నిశ్శబ్ద్' చిత్రంలో 'రోజానా జియే, రోజానా మారే' పాటను పాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios