Air Pollution: మరో 5 రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా..?

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. 6 నుంచి పదో తరగతి స్టూడెంట్లకు స్కూల్లో లేదా ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవచ్చని తెలిపింది. 

Delhi government has extended a holiday for schools in delhi for five days due to air pollution KRJ

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే.. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను ప్రకటించారు.  తాజా ప్రకటనతో నవంబరు 10వ తేదీ వరకు సెలవులు పొడిగించింది. కాగా.. 6 నుంచి పదో తరగతి స్టూడెంట్లకు స్కూల్లో లేదా ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవచ్చని ప్రభుత్వం చూసించింది.

ఈ సందర్భంగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ .. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపారు.  కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతోందని, అందువల్ల  అన్ని పాఠశాలలు నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించామని తెలిపారు. అదే సమయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు..


ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  (ఏక్యూఐ) 486గా ఉంది. శనివారం (504) తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో ప్రాథమిక (1 నుంచి 5వ తరగతి వరకు) తరగతులకు నవంబర్ 10వ తేదీ వరకు తరగతులు నిర్వహించడం లేదు. అయితే 6వ తరగతి నుండి ఆపై  పాఠశాల పిల్లలను ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి అవకాశం కల్పించి ప్రభుత్వం. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను బట్టి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్ తరగతులు ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయ సిబ్బంది కూడా క్రమం తప్పకుండా వస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీలో విషపూరితమైన, దట్టమైన పొగమంచు అవరించి ఉంది. గత ఆరు రోజులుగా దేశ రాజధానిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొనే అవకాశముంది. ప్రతికూల గాలుల పరిస్థితుల కారణంగా, ముఖ్యంగా రాత్రి వేగవంతమైన గాలి వేగం కారణంగా, కాలుష్య స్థాయి మరోసారి 'చాలా తీవ్రమైన' వర్గానికి చేరుకుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యత సూచిక 415 నుంచి ఆదివారం ఉదయం 7 గంటలకు 460కి పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 3 మరియు 4 తేదీల్లో మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో ప్రకటించారు.

మరోవైపు ఢిల్లీలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో జనం తీవ్ర అస్వస్థ తకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios