Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ కుర్రాళ్లే... యువతుల అశ్లీల ఫోటోలు, అత్యాచారాలు చేయాలంటూ కామెంట్స్..

అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొడుతూ కామెంట్లు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేశారు.

Delhi Girl exposes Instagram chat group 'Bois Locker Room' discussing gang raping girls, netizens seek action
Author
Hyderabad, First Published May 5, 2020, 7:35 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో.. ఖాళీగా ఉండటంతో అందరూ సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు.

అయితే.. కొందరు యువకులు మాత్రం అసాంఘీక చర్యలకు పాల్పడేందుకు సోషల్ మీడియాను వాడేయడం గమనార్హం. ‘‘ బాయ్స్‌ లాకర్‌ రూం’’ పేరిట గ్రూప్‌ క్రియేట్‌ చేసి.. అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొడుతూ కామెంట్లు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేశారు. వీరి బాగోతాన్ని ఓ బాలిక ట్విటర్‌ వేదికగా బహితర్గంతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... 17-18 ఏళ్ల వయస్సున్న అబ్బాయిలు కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడ్డారు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌, స్పాన్‌చాట్‌లలో షేర్‌ చేస్తున్నారు. తన స్కూలుకు చెందిన అబ్బాయి ఒకరు ఈ గ్యాంగ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలుసుకున్న ఓ బాలిక..  ఆ గ్రూపు వివరాలను తెలుపుతూ ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టింది. 

వారి సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసింది. ఇటువంటి వాళ్లు ఉంటారు కాబట్టే తనను సోషల్‌ మీడియా వాడొద్దని అమ్మ చెప్పిందని.. తన ఇన్‌స్టా అకౌంట్‌ తొలగించాలంటూ ఒత్తిడి చేస్తోందని రాసుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో సదరు గ్రూపును గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని.. ఇప్పటికే చాలా మందిని ఈ వేదిక స్టార్లను చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios