ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ రాష్ట్రంలో వరుసగా ఆరో సంవత్సరం కూడా విద్యుత్ సుంకాన్ని పెంచకూడదని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 సంవత్సరానికి నగరంలో విద్యుత్ సుంకాల పెంపుపై ఆగస్టు 28 న సమావేశమైన ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డిఇఆర్సి) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. "ఢిల్లీ ప్రజలకు అభినందనలు. ఒక వైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ రేట్లు సంవత్సరానికి పెరుగుతున్న వేళ,  ఢిల్లీ మాత్రం విద్యుత్ రేటును ఆరు సంవత్సరాలుగా పెంచింది లేదు. కొన్ని ప్రాంతాలలో రేటును తగ్గించింది కూడా. ఇది చారిత్రాత్మకమైనది. ఢిల్లీలో మీరు నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోబట్టే ఇది సాధ్యమైంది"

కొరోనావైరస్ మహమ్మారి కారణంగా, బిఎస్ఇఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బిఆర్పిఎల్), బిఎస్ఇఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బివైపిఎల్),  టాటా పవర్ ఢిల్లీ  డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టిపిడిడిఎల్), న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్‌డిఎంసి) వంటి విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయంలో పెరుగుదల లేనందున మార్చి నెలలో కూడా సుంకంలో ఎటువంటి మార్పు ఉండదని డిఇఆర్సి తెలిపింది. 

అధిక విద్యుత్ సుంకాలకు వ్యతిరేకంగా 2013 లో అరవింద్ కేజ్రీవాల్ ఆమరణ నిరాహార దీక్ష (బిజ్లి - పానీ సత్యాగ్రహం) చేసారు. దేశంలో చౌకైన విద్యుత్తును అందిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చాక విద్యుత్ రేట్లను 50 శాతం మేర తగ్గించారు కేజ్రీవాల్. 

అధికారంలోకి రాగానే ఆప్ ప్రభుత్వం విద్యుత్ రేట్ల పెంపు విషయంలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఇతర రాష్ట్రాల్లో యూనిట్ యూనిట్ల విద్యుత్ రేట్లు అంటే....  గుజరాత్‌లో 100 యూనిట్ల వరకు రూ. 3.5, 101-200 యూనిట్లకు రూ .4.15, పంజాబ్‌లో 100 యూనిట్ల వరకు రూ .4.49, 101-200 యూనిట్లకు రూ .6.34, గోవాలో 100 యూనిట్ల వరకు రూ .1.5, 101-200 యూనిట్ల వరకు 2.25. లు ఉండగా..... ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రతి యూనిట్ విద్యుత్ రేటు 200 యూనిట్ల వినియోగం వరకు 0, 201-400 యూనిట్ల మధ్య వినియోగానికి 50% సబ్సిడీ ఇవ్వబడుతుంది.

ఇటీవలే ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (యుపిఇఆర్సి) రాష్ట్రంలో విద్యుత్ రేట్లను పెంచింది. 150 యూనిట్ల వరకు రూ .4.9 గా ఉన్న సుంకాన్ని రూ .5 5.5 కుపెంచింది, 151-300 యూనిట్ల వరకు వాడకంపై రూ .5.4 నుండి 6 రూపాయలకు, 301-500 యూనిట్ల వాడకంపై రూ .6.2 నుండి రూ .6.5 కు, 500 యూనిట్ల కన్నా ఎక్కువగా వినియోగిస్తే రూ .6.5 గా ఉన్న సుంకాన్ని రూ .7 కు పెంచారు. 

కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ దెబ్బకు ఢిల్లీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఆదాయం 3,500 కోట్లు ఉండగా... ఈ 2020 ఏప్రిల్ లో 300 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ.... విద్యుత్ చార్జీలను పెంచొద్దనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల దాదాపు 62 లక్షలమంది వినియోగదారులు లాభపడనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా మహమ్మరి విజృంభిస్తున్న వేళ ప్రాజాలు తమ ఉద్యోగాల్లో కోతలను భరిస్తూ ఉన్నారు. చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇండ్లకే పరిమితమైపోయారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపిస్తూ విద్యుత్ చార్జీలను పెంచలేదు. 2019 సెప్టెంబర్ నాటికి 14 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్ ను అందిస్తే... నవంబర్ డిసెంబర్ 2019 నాటికి 26 లక్షల కుటుంబాలు 0 ఎలక్ట్రిసిటీ బిల్లులను పొందాయి.