దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం మరింత తీవ్రరూపు దాల్చింది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ కరువైంది. దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం మరింత తీవ్రరూపు దాల్చింది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ కరువైంది. దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

ఆసుపత్రుల్లో ఇంకా కొద్దిగంటలే రోగులకు ఆక్సిజన్ ఇవ్వగలమని తెలిపారు. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో కొద్దిగంటలకు సరిపడినంత ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో వుంది.

కాగా, దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా వుంది. కరోనా రోగులకు బెడ్స్ దొరకడం లేదు. ఒకవేళ ఎంతో కష్టపడి సంపాదించినా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ పరిస్ధితుల్లో ఢిల్లీ లాక్‌డౌన్ సైతం ఎదుర్కొంటోంది. 

Also Read:కరోనా కల్లోలం: రైల్వే వ్యాగన్లతో ఆక్సిజన్ సరఫరా

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానున్నట్టు తెలిపారు.

ఏప్రిల్ 26 ఉదయం వరకు లాక్‌డౌన్ కొనసాగనుతుందని ఈ మేరకు కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ విధించక తప్పడం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.