Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎగ్జిట్ పోల్: సిఎన్ఎన్- న్యూస్ 18 సర్వే... తిరిగి మరో సారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది

Delhi Exit poll: Aam Admi party to regain Power in Delhi predicts CNN news 18
Author
New Delhi, First Published Feb 8, 2020, 6:51 PM IST

ఇప్పుడే విడుదలైన సిఎన్ఎన్- న్యూస్ 18  ఎగ్జిట్ పోల్ కేజ్రీవాల్ దే ఆధిక్యత అని తేల్చింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తేల్చి చెబుతున్నాయి.  

ఆప్ 44 సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ 26 సీట్లను గెలుస్తుందని, కాంగ్రెస్ గతసారి లాగానే ఒక్క సీటు కూడా గెలవలేదని తెలిపింది.   

also read  ఢిల్లీ ఎగ్జిట్ పోల్: హస్తిన మళ్ళీ ఆప్ హస్తగతం... స్పష్టం చేసిన టైమ్స్ నౌ

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది..  

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆప్ గెలిస్తే మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. బిజెపి తన సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెసు 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది.

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్: మరోసారి ఊడ్చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ... కుండబద్దలుకొట్టిన రిపబ్లిక్- జన్ కి బాత్ సర్వే

ఢిల్లీలో మొత్తం 13,571 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. లక్షా 24 మంది పోలింగ్ విధులు నిర్వహిచారు. ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,86,382 మంది ఉండగా అందులో మహిళలు 66 లక్షల 80 వేల 277 మంది, పురుషులు 81 వేల 5 వేల 236 మంది ఉన్నారు.

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బిజెపి 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెసు పార్టీ ఖాతానే తెరవలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios