న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మజ్నూ కా తీలా సమీపంలో శనివారం పోలింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెసు అభ్యర్థి అల్కా లాంబ ఆప్ కార్యకర్తపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు.. 

అల్కా లాంబ వ్యవహారంపై తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆప్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. ఇరు వర్గాలు బూతులు తిట్టుకున్నారు. ఘర్షణను నివారించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.