Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదు, పలు ప్రాంతాల్లో ప్రభావం..

ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం రిక్టర్ స్కేల్ లో 3.7గా నమోదయ్యింది. హర్యానాలోని జజ్జర్ కు ఉత్తరాన 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Delhi earthquake : Earthquake of magnitude 3.7 strikes Haryana, tremors felt in Delhi - bsb
Author
Hyderabad, First Published Jul 6, 2021, 10:09 AM IST

ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం రిక్టర్ స్కేల్ లో 3.7గా నమోదయ్యింది. హర్యానాలోని జజ్జర్ కు ఉత్తరాన 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం లోతు 5 కి.మీ. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అంతకుముందు ఆదివారం గుజరాత్ లోని కచ్ జిల్లాలో 3.7తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటలకు జరిగింది. భూకంప కేంద్ర దుధైకి ఈశాన్యంగా 19 కి.మీ. దూరంలో 11.8కి.మీ. లోతులో ఉందని గాంధీనగర్ కేంద్రగా ఉన్న భూకంప పరిశోధన సంస్థ అధికారి తెలిపారు.

గత ఏడాది ఏప్పిల్-ఆగస్టులో రాజధాని ప్రాంతంలో అనేక భూకంపాలు సంభవించిన తరువాత, భూకంప కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడానికి సెంటర్ ఫర్ సీస్మోలజీ అదనపు భూకంప రికార్డింగ్ పరికరాలను మోహరించింది.

ఈశాన్య ఢిల్లీ రోహ్ తక్, సోనిపట్, బాగ్ పట్, ఫరీదాబాద్, అల్వార్లలో కేంద్రాలు 2020 ఏప్పిల్ నుంచి ఆగస్ట్ వరకు తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా Acti ఢిల్లీలోని వజీరాబాద, తైమూర్పూర్, కమలా నెహ్రూ రిడ్జ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, అల్వార్ జిల్లాలు, సోనిపట్, సోహ్నా, గురుగ్రామ్, రోహ్తక్, రేవారి, హర్యానా ప్రాంతాలలో భూమి కదలికతో సహా పలు సంకేతాలు గమనించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios