Delhi earthquake : ఢిల్లీలో మళ్లీ భూకంపం.. ఉత్తర జిల్లాలో కంపించిన భూమి..
ఢిల్లీలో ఉత్తర జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. ఈ ప్రకంపనల తీవ్రత 2.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఢిల్లీలో మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు ఉన్నట్టు భూమి ఒక్క సారిగా కంపించింది. ఉత్తర జిల్లాలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 2.6గా నమోదు అయ్యిందని పేర్కొంది.
Kanna Lakshminarayana : ఏపీకి జగన్ అవసరం లేదు.. దానికి 100 కారణాలు చెబుతాం - కన్నా లక్ష్మీనారాయణ
అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ నేపాల్ లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సీస్మిక్ జోన్ మ్యాప్ ప్రకారం ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) జోన్ 4 పరిధిలోకి వస్తాయి. జోన్-4లో మోస్తరు నుంచి అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
UCC : ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానున్న యూనిఫాం సివిల్ కోడ్.. ఎప్పటి నుంచి అంటే..
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.