Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ ఆత్మహత్య: ఆప్ ఎమ్మెల్యే కారణమంటూ సూసైడ్ నోట్

దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కారణమంటూ డాక్టర్ తాను రాసిన రెండు పేజీలో సూసైడ్ నోట్ లో రాశాడు. 

Delhi doctor commits suicide, blamed AAP MLA
Author
Delhi, First Published Apr 19, 2020, 7:19 AM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 52 ఏళ్ల డాక్టర్ శనివారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను సూసైడ్ నోట్ లో రాశాడు. ఆ మేరకు అతను రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే, అతని అనచురుడు తనను డబ్బులు డిమాండ్ చేశారని, తను నిరాకరించడంతో తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీసే పనికి ఒడిగట్టారని డాక్టర్ ఆరోపించాడు. మృతుడు రాజేంద్ర సింగ్ ఢిల్లీలోని నేబ్ సరాయ్ ఏరియాలో ఉంటున్నాడు. అతనికి వాటర్ ట్యాంకర్ సర్వీస్ ఉంది. 

డాక్టర్ ఉరేసుకోవడానికి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన సూసైడ్ నోట్ లో రాజేంద్ర సింగ్ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ ను, అతని అనుచరుడు కపిల్ నాగర్ ను నిందించాడు. 

పోలీసులు డాక్టర్ వ్యక్తిగత డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. డైరీలో తాను వేధింపులకు గురైన విషయాన్ని రాసినట్లు భావిస్తున్నారు. తన ట్యాంకర్లను ఢిల్లీ జల్ బోర్డు ్ద్దెకు తీసుకుంది. దానికి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశాడని, తను ఇవ్వడానికి నిరాకరించడంతో జల్ బోర్డు సర్వీసు నుంచి తన ట్యాంకర్లను తీసేయించారని డాక్టర్ తన డైరీలో రాసుకున్నాడు. 

డాక్టర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. ఎమ్మెల్యేపై, అతని అనుచరుడిపై కేసులు నమోదు చేశారు. ఓ మహిళను వేధించినందుకు 2018లో జర్వాల్ పై అప్పట్లో కేసు కూడా నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios