ఢిల్లీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చికిత్స అందిస్తున్న డాక్టర్ బుష్రా కానమ్ రుతుచక్ర పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన పేషెంట్లలో ఈ అవగాహన పెంచడానికి పాటుపడ్డారు. శానిటరీ ప్యాడ్లు తరుచూ మార్చుకోవాలని, ప్రైవేట్ పార్టులు డ్రైగా ఉంచుకోవాలని ఆమె సూచనలు చేస్తుంటారు. 

న్యూఢిల్లీ: డాక్టర్ బుష్రా ఖానమ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో తన ఇంటిలోనే ఏర్పాటు చేసిన క్లినిక్‌లో పేషెంట్లకు చికిత్స అందిస్తున్నది. జామియా హమ్‌దర్డ్ యూనివర్సిటీ నుంచి బీయూఎంఎస్ చదివిన ఆమె గత మూడు దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు ఎక్కవగా చికిత్స అందిస్తున్నది. పది మంది సంతానంలో ఆమె ఒకరు. తల్లిదండ్రులు పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టడంతో ఆమె డాక్టర్‌గా ఎదిగారు. మొహమ్మద్ రశీద్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. తల్లి, అత్త ప్రోత్సాహంతో క్లినిక్ ప్రారంభించింది.

ఆమె ఇటీవలే ఎన్జీవో ఆవాజ్ ఎ ఖ్వాతీన్‌తో కలిసి మెన్‌స్ట్రువల్ హైజీన్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. ఆమెను కదిలించగా ఆవాజ్ ది వాయిస్‌‌తో మాటలు పంచుకున్నారు.

రుతుచక్రం పరిశుభ్రత గురించి ఎప్పటి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?

నేను సాధారణంగా సమాజంలో ఆర్థికంగా అణగారిన వర్గాల పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాను. ఆ కమ్యూనిటీకి చెందిన మహిళలకు కనీస పరిశుభ్రత గురించి అవగాహన ఉండదు. ఇక రుతుచక్ర పరిశుభ్రత గురించి చెప్పక్కర్లేదు. ఇది చూసే తల్లులు, బిడ్డలకు పరిశుభ్రత గురించి చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.

ఒక డాక్టర్ అయిన మీరు అవగాహన కార్యక్రమాల్లోకి వెళ్లడానికి ఏ అంశం పురికొల్పింది?

నా క్లినిక్‌లోకి వచ్చే మహిళలు వారి ప్రైవేటు పార్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్‌లతో బాధపడేవారున్నారు. అది నన్ను బాధించింది. రుతుస్రావం జరుగుతున్నప్పుడు వారు అపరిశుభ్రమైన వస్త్రాలను వాడతారని, వాటినే మళ్లీ మళ్లీ వాడుతారని తెలుసుకున్నాను. కొందరు ఆడ పిల్లలకైతే రుతుస్రావం గురించే తెలియదు. బ్లీడింగ్ అవడం వల్ల ఏదైనా వ్యాధితో బాధపడుతున్నానా? అనే భయంతో వచ్చినవారున్నారు. కొందరికి కాటన్ ప్యాడ్‌లు ఎలా వాడాలి? ప్యాడ్ లేదా శానిటరీ టవల్‌ను పట్టి ఉంచడానికి అండర్‌వేర్ ధరించాలన్న అవగాహన కూడా లేదు. ఇదే నాకు మేల్కోలుపుగా మారింది. పలు విధాల ప్యాడ్‌లను పరిచయం చేయడమే కాదు.. వారి ప్రైవేట్ పార్ట్‌ను పొడిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకదనే వివరాలనూ వారికి అందించాను.

పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వారికి అర్థం చేయించడం మీకు ఎంతటి కఠిన పనిగా ఉంటుంది?

ఇది చాలా టఫ్. ఎందుకంట నిమ్న వర్గాల ఆడ పిల్లలు దేన్నీ త్వరగా అంగీకరించరు. అపరిశుభ్ర వస్త్రాల కారణంగా వారి ప్రైవేట్ పార్ట్‌లలో ఇన్ఫెక్షన్ సోకడమే కాదు.. అది మొత్తం దేహమంతా వ్యాపిస్తుందని అర్థం చేయించడం అంత సులువైన పనేమీ కాదు.

Also Read: G-20 meet: శ్రీనగర్ మార్కెట్ ఏరియాకు మెరుగులు.. యూరప్ ప్రాంతాలతో పోలికలు..సెల్ఫీ పాయింట్‌గా పోలో వ్యూ మార్కెట్

వారితో తరుచూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది అర్థం చేయించడానికి అందుబాటులో ఉన్న ఏజెన్సీల ఇలస్ట్రేషన్లు, మ్యాగజీన్లు, డ్రాయింగ్‌లను చూపించి అర్థం చేయిస్తుంటాను. వారి నిర్లక్ష్య వైఖరి మూలంగా సంతానం జాప్యం అయ్యే ముప్పు ఉంటుందని, యుటెరస్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని, కొన్ని సార్లు అసహజ మరణాలకూ దారితీసే అవకాశాలు ఉంటాయని వివరిస్తాను. ఇదంతా చిన్న దురదతో ప్రారంభమవుతుందనీ చెబుతాను. ఇలా హేతుబద్ధంగా వివరించి అర్థం చేయించడంలో విజయవంతమవుతాను.

ఏదైనా ఒక ప్రత్యేక కేసు గురించి చెబుతారా?

నా వద్దకు వచ్చే ఓ పేషెంట్ హెర్పెస్ (వైరల్ ఇన్ఫెక్షన్)తో బారిన పడింది. అపరిశుభ్రత వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఆమెకు సోకింది. దీనితో ఆమె బాడీలో ఎంతో నొప్పితో కూడుకున్న కణతి వంటివి ఏర్పడ్డాయి. ఆమె ప్రైవేట్ పార్టు చుట్టూ అవి ఏర్పడి ఆమె చిత్రవధ అనుభవించింది. ఆమె బాధను చూస్తే నాకు కళ్లలో నీళ్లు తిరిగేవి.

ప్రైవేట్ పార్ట్‌ను వీలైనంత పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని, మెడిసినల్ పౌడర్, శానిటరీ ప్యాడ్స్, ప్రైవేట్ పార్ట్స్‌ను వైప్ చేయడానికి టిష్యూలను ఉపయోగించాలని సలహా ఇచ్చాను. కొన్ని రోజుల వరకు ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చాను. ఆ తర్వాత ఆమె కోలుకుంది. వైద్యంతోపాటు మహిళలకు మానసిక తోడ్పాటూ అవసరం ఉంటుంది.

ముస్లింలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై అవగాహన తక్కువగా ఉందని భావిస్తారా?

ఔను. ఈ వర్గాల్లోని మహిళలు, బాలికలు నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ, రుతుస్రావం వంటి అంశాలపై మాత్రం నోరుమెదపరు. అందుకే అవగాహన కూడా చాలా తక్కువ. పిల్లలు తల్లులను అడగడానికి సిగ్గుపడతారు. తల్లి కూడా అలాంటి మాటలు మాట్లాడటం నిషిద్ధమనే భావనలో ఉంటారు. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. మన దేశంలో ఆడ పిల్లలు 11 ఏళ్లకు బ్లీడింగ్ చేస్తుంటారు. కానీ, ఇది తల్లులు అంగీకరించారు. ఆమెకు ఎందుకు ఇంత త్వరగా పీరియల్స్ వచ్చాయని తల్లులూ తనను అడుగుతుంటారు. దానికి నా వద్ద సమాధానం లేదు. కానీ, ఇది సర్వసాధారణమని చెబుతుంటాను. బ్లీడింగ్ అనే విషయాన్ని సాధారణీకరించాల్సిన అవసరం ఉన్నది. దాని చుట్టూ ఉన్న నిషిద్ధాలను బద్ధలుకొట్టాలి. ప్రతి నెలా రక్తస్రావం కావడం తప్పేమీ కాదు.

Also Read: ప్యాడ్ వుమన్ ఇర్ఫానా సమాజ సేవ.. ‘మగాళ్లు పాలరాతి భవనాలనైనా కడతారు కానీ మహిళకు శానిటరీ నాప్కిన్ కొనివ్వరు’

అందుకే అలాంటి వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నిజాయితీగా బహిరంగంగా శశభిషలు లేకుండా ఈ విషయాలపై మాట్లాడుతుంటాను. రుతుచక్రం చుట్టూ అల్లుకున్న నిషిద్ధాలను తొలగించాలనేదే నా తాపత్రయం. రుతుస్రావం రోజుల్లో బిడ్డల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని తల్లులకు నేను సూచిస్తుంటాను. అండర్‌గార్మెంట్స్ వేసుకుని శానిటరీ ప్యాడ్స్ వాడాలనీ చెబుతుంటాను. ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చాలనీ సూచిస్తుంటాను. 

ఇప్పటి వరకు మీకు సవాలుగా అనిపించిన కేసు ఏమిటీ?

అది కోవిడ్ 19 సమయంలో వచ్చింది. మెడిసినల్ సహకారం చాలా స్వల్పంగా ఉండేది అప్పుడు. నేను నా భర్తతో కలిసి పేషెంట్లకు చికిత్స అందించాను. ప్రసవ సమయాల్లోనూ నేను పేషెంట్లకు సహకరించాను. 

మా పాఠకులకు మీరేమైనా సలహాలు ఇస్తారా?

వేసవి కాలం ఇన్ఫెక్షన్లకు అను వైనది. కాబట్టి, ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ప్రైవేట్ పార్ట్ డ్రైగా ఉంచుకోవాలి. ప్యాడ్లు తరుచూ మార్చుకోవాలి.

--- శైస్తా ఫాతిమా