కరోనా మహమ్మారి  తీవ్ర రూపం దాలుస్తోంది. దేశంలో మొదలైన సెకండ్ వేవ్ భయంకర రూపుదిద్దుకుంటోంది. గతంలోనూ లక్షల్లో కరోనా కేసులు నమోదౌనప్పటికీ.. ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 1,033మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కేవలం ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే 104 మంది నిన్న ఒక్కరోజు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

గతేడాది అక్టోబర్ 2020 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే.. ఇప్పుడు కరోనా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీలోని అతి పెద్ద స్మశానవాటిక నిగాంబోడ్ ఘాట్‌లో దహన సంస్కారాల సంఖ్య కనీసం 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఈ స్మశానవాటికలో కరోనా మృతుల అంత్యక్రియలు ఒకరి తర్వాత మరొకరికి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయట. ఇలానే కంటిన్యూ అయితే.. ఈ స్మశానవాటిక సరిపోదని అక్కడి వారు చెబుతున్నారు. 

గత వారం వరకు మహా అయితే రోజుకి 10 నుంచి 15 మంది చనిపోయి ఆ స్మశాన వాటికకు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య రెట్టింపు అయ్యిందని వారు చెబుతున్నారరు.  రోజుకి కనీసం 80 మంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని.. వారంతా కరోనా మృతులేనని వారు పేర్కొన్నారు. 

అధికారిక గణాంకాల ప్రకారం, వైరస్ కారణంగా  ఏప్రిల్ మొదటి 13 రోజుల్లో Delhi లో 409 మంది ప్రాణాలు కోల్పోయారు., మార్చి మొత్తం నెలలో 117 మంది, ఫిబ్రవరిలో 57 మంది మరణించారు.

దేశ రాజధానిలో ఈ మరణాల రేటు ఆకస్మికంగా పెరగడం నగరంలోని శ్మశానవాటికలలో మృతదేహాల తాకిడి బాగా పెరిగిపోయింది.

స్థానిక స్మశానవాటికలకు సైతం తాకిడి ఎక్కువగా ఉండటంతో COVID-19 రోగుల మృతదేహాలను నగర వ్యాప్తంగా ఈ స్మశానవాటికకే తీసుకువస్తున్నారని స్మశానవాటిక నిర్వహణ కమిటీ సభ్యుడు మష్కూర్ రషీద్ తెలిపారు.

అయితే, నగరంలో పలు స్మశానవాటికలను నిర్వహిస్తున్న Delhi వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అమంటుల్లా ఖాన్ మాట్లాడుతూ, ఖననం చేయడానికి ఇప్పటివరకు భూమి కొరత లేదని అన్నారు. "ఖననం చేయడానికి మాకు తగినంత భూమి ఉంది." అని స్పష్టం చేశారు.

ఖననం కోసం భూమిని ఏర్పాటు చేయడానికి సహాయం కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసినట్లు ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాష్ తెలిపారు.

"COVID-19 బాధితుల ఖననం కోసం ముఖ్యంగా తవ్విన సమాధులు అవసరం, ఇవి మరణాల సంఖ్య పెరుగుతున్నందున బ్యాక్‌హో లోడర్ల ద్వారా తయారు చేస్తున్నారు. వీటిని తవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది’ అని మునిసిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు ఖననం పర్యవేక్షిస్తున్నారు.

"4-5 అడుగుల లోతులో ఉన్న సాధారణ సమాధులతో పోలిస్తే, COVID-19 బాధితులను 12-14 అడుగుల లోతులో ఖననం చేయవలసి ఉంది. వైరస్  అధిక అంటువ్యాధి కారణంగాసమాధులను కూడా తిరిగి ఉపయోగించలేరు" అని ఆయన చెప్పారు.