పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా.. అతని నుంచి..

పిజ్జాలు డెలివరీ బాయ్ కు ఆ తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ దక్షిణ జిల్లా మేజిస్ట్రేట్ బీఎం మిశ్రా ఈ వివరాలను తెలిపినట్టు ఆ కథనం పేర్కొంది. 

Delhi Covid-19 positive pizza delivery boy's contacts test negative

ఇటవల దేశ రాజధాని ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఎందుకంటే.. సదరు పిజ్జా డెలివరీ బాయ్ దాదాపు 70మంది కి పైగా కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేశాడు. దీంతో.. వారందరికీ కూడా కరోనా వస్తుందని అందరూ భయపడిపోయారు. అయితే.. అతని నుంచి ఇప్పటి వరకు ఎవరికీ కరోనా సోకలేదని అధికారులు నిర్థారించారు.  అతని కాంటాక్ట్స్ అందరికీ పరీక్షలు నిర్వహించగా.. వారికి నెగిటివ్ వచ్చినట్లు తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ దక్షిణ జిల్లాకు చెందిన ఒక పిజ్జా డోర్ డెలివరీ సంస్థ నుంచి కొందరు ఇటీవల పిజ్జాలు తెప్పించుకున్నారు. పిజ్జాలు డెలివరీ బాయ్ కు ఆ తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ దక్షిణ జిల్లా మేజిస్ట్రేట్ బీఎం మిశ్రా ఈ వివరాలను తెలిపినట్టు ఆ కథనం పేర్కొంది. 

దాని ప్రకారం కరోనా పాజిటివ్ తేలిన డెలివరీ బాయ్ తో సహా ఆ సంస్థలో డెలివరీ బాయ్ లు గా పని చేస్తున్న 16 మందిని క్వారంటైన్ కు తరలించారు. మంగళవారం వారు ఢిల్లీలో 72 కుటుంబాలకు పిజ్జా డెలివరీ ఇచ్చినట్టు గుర్తించారు. వారందరినీ కలిసిన అధికారులు ఆ 72 కుటుంబాలనూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా చెప్పారు.

తాజాగా.. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో.. ఈ వార్తతో హస్తిన వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త తర్వాత ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి కూడా పలువురు భయపడిపోతున్నారు. ఈ వార్త కారణంగానే తెలంగాణలో స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీపై నిషేధం కూడా విధించడం గమనార్హం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios