అబూ సలేంకు ఏడేళ్ల జైలు..

బెదిరింపుల కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. తాను కోరినంత మొత్తం ఇవ్వని పక్షంలో కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో అబూపై 2002లో ఐపీసీ సెక్షన్ 387, సెక్షన్ 506 కింద బలవంతపు వసూళ్ల కేసు నమోదైంది. కాగా, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అబూ సలేంను ఇప్పటికే న్యాయస్థానం దోషిగా తేల్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred