Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ కి ఢిల్లీ కోర్టు సమన్లు

చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై కేజ్రీవాల్ తన సొంత నివాసంలో దాడి చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.
 

Delhi court summons Kejriwal, Sisodia, 11 AAP MLAs in chief secy assault case
Author
Hyderabad, First Published Sep 18, 2018, 12:29 PM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి  ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై కేజ్రీవాల్ తన సొంత నివాసంలో దాడి చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.

పాటియాలా హౌజ్ కోర్టు సీఎం కేజ్రీతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీని కొట్టిన కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. కేజ్రీతో పాటు 11 మంది మంత్రులు ఆ దాడికి కారణమంటూ ఆ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీన కేజ్రీవాల్ కోర్టుకు రావాలంటూ ఆదేశించారు.

సీఎస్‌పై దాడి జరిగిన కేసులో మే 18వ తేదీన సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఓ సమావేశానికి కేజ్రీ ఇంటికి వెళ్లిన సీఎస్‌పై దాడి జరిగింది. సీఎం సమక్షంలోనే దాడి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో మొత్తం 11 మంది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios