న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. అత్యాచార యత్నాన్ని కప్పిపుచ్చుకోవడానికి దంపతులు వరుసకు కూతురు అయ్యే బాలికను హత్య చేసి శవాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టారు. 17 ఏళ్ల బాలికపై చిన్నాన్న అత్యాచార యత్నం చేశాడు. ఢిల్లీలో బాలిక తన మేనమామ, అత్తలతో కలిసి ఉంటుంది.

బాలికపై మేనమామ అత్యాచారయత్నం చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దంపతులు బాలికను హత్య చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ సంఘటన ఢిల్లీలోని నంద్నాగ్రి ప్రాంతంలో గత నెలలో జరిగింది. 

బాలిక తనకు చిన్నాన్న వకీల్ పోదార్ (51), అతని భార్యలతో కలిసి ఉంటూ చదువుకుంటోంది. అయితే, బాలిక అక్టోబర్ 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆమె శవం కుళ్లిపోయిన స్థితిలో దంపతుల ఇంట్లోని బెడ్ బాక్స్ కనిపించింది. 

తాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి వచ్చానని, బాలిక ఆ సమయంలో తనకు కనిపించలేదని బిచ్చగత్తె అయిన బాలిక ్త్త పోలీసులకు చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని ఓ అనాథాశ్రమానికి బాలికను అప్పగించినట్లు చెప్పింది.

అక్టోబర్ 23వ తేదీన అనాథాశ్రమానికి ఆ పేరు గల బాలిక ఎవరూ రాలేదని పోలీసులు గుర్తించారు. కాగా, వకీల్ పోదార్ కూడా కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోదార్ ను పోలీసులు బీహార్ లోని ఓ బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద అతన్ని ఢిల్లీకి తరలించి పోలీసులు విచారించారు. 

విచారణలో పోదార్ దిమ్మతిరిగే విషయాలు వెల్లడించాడు. బాలిక తన వదిన కూతురు అని, నెల క్రితం ఆ బాలికతో తాను సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించానని, అయితే, బాలిక తిరస్కరించిందని, ఆ విషయం తన భార్యకు తెలిసిందని, దాంతో తమ ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయని అతను వివరించాడు. 

ఈ స్థితిలో బాలికను తమ వద్దే ఉంచుకోవాలని భావించినప్పటికీ అతని భార్య గ్రామానికి పంపించేయాలని నిర్ణయించింది. తన చదువు పూర్తి చేసుకుంటానని, తాను గ్రామానికి వెళ్లనని మృతురాలి చెప్పింది. దానిపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. 

దాంతో ఆగ్రహాన్ని నిలువరించుకోలేక బాలికను చంపేయాలని పోదార్ కు భార్య చెప్పింది. తన భార్య బయటకు వెళ్లిన సమయంలో పోదార్ బాలికపై ఐరాన్ రాడ్ తో దాడి చేశాడు. రక్తమోడుతున్న బాలికను బ్లాంకెట్ లో చుట్టి బెడ్ బాక్స్ లో దాచాడు. ఆ తర్వాత గదిని, ఐరన్ రాడ్ ను భార్యతో కలిసి శుభ్రంగా కడిగేశాడు. శవాన్ని తరలించి ఎక్కడైనా పారేయాలనే వారి ఆలోచన అమలు కాలేదు.