Chinese Manjha: ఢిల్లీలో చైనీస్ మాంజా విక్రయించే వ్యాపారం అంతా కోడ్‌వర్డ్‌లో జరుగుతుంది. చైనీస్ మాంజాను ట్రక్కులో సూరత్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్ర‌మంలో  మాంజా విక్రయిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసిన వారి నుంచి 12 వేల మాంజా రోల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Chinese Manjha: దేశ రాజధాని ఢిల్లీలో చైనా మాంజా చైనా మాంజా(గాలిప‌టం దారం) బీభత్సం సృష్టించింది. మాంజా కార‌ణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని హైదర్‌పూర్ ఫ్లైఓవర్ పై లో వెళ్తున్న‌ ద్విచ‌క్ర వాహ‌నదారునికి చైనా మాంజా ఢీకొట్టింది. దీంతో అతని మెడకు తీవ్ర గాయ‌మైంది. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, డాక్ట‌ర్లు ప్రాణాలను కాపాడలేకపోయారు వైద్యులు. ఈ ఘటన జూలై 25న జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ తన దుకాణం మూసి బురారీ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. హైదర్‌పూర్ ఫ్లై ఓవర్ వద్దకు ఆ యువ‌కుడికి చైనీస్ మాంజా అడ్డుప‌డింది. దీంతో అత‌ని మెడ‌కు తీవ్ర గాయ‌మైంది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం దేశంలోని ప‌లు ప్రాంతాల్లో చైనీస్ మాంజా మరణాలు న‌మోదవుతున్నారు. గాలిపటం దారాల వ‌ల్ల చాలా మంది గాయపడుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసారి కూడా చైనీస్ మాంజా కారణంగా సుమిత్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు మాంజా విక్ర‌యాల‌పై దాడులకు దిగారు.

చైనీస్ మాంజాపై పోలీసుల చర్యలు 

చైనీస్ మాంజాపై నిషేధం ఉన్నా మార్కెట్ లో వీటిని అక్ర‌మంగా విక్ర‌యిస్తున్నారు. వీటిని అరిక‌ట్ట‌డానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పోలీసుల స్పెషల్ స్టాఫ్ టీమ్ ఓ గోదాముపై దాడి చేసి 11,760 చైనీస్ మాంజా రోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అమర్జీత్ అనే మాంజా డీల‌ర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్జీత్ ఒక కోడ్‌ వర్డ్‌ ద్వారా దుకాణదారులకు చైనీస్‌ మాంజాను సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు. 

మోనో కైట్ మాంజా బ్రాండ్ పేరుతో 400 చైనీస్ మాంజా కార్టన్‌లను నోయిడాలోని ఒక డీల‌ర్ నుండి నెల రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు అమర్జీత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ మాంజా సూరత్ నుంచి ట్రక్కులో ఢిల్లీకి వచ్చినట్లు తెలిపాడు. అమర్జీత్ మాంజాను అద్దెకు తీసుకున్న ఓ గోడౌన్‌లో నిల్వ చేసి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని దుకాణదారులకు విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇది కాకుండా, దక్షిణ ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్టు చేశారు. వారి నుండి 95 చైనీస్ మాంజా రోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

చైనీస్ మాంజా చాలా ప్రమాదకరం. ఈ మాంజా కారణంగా ప్రతి ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం 2017 నుండి చైనీస్ మాంజాపై నిషేధం విధించింది. ఈ మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ.. దేశంలో ప‌లు చోట్ల ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి.