యువతిని చితకబాదిన ఎస్సై తనయుడు...ఆ వీడియోతో మాజీ ప్రియురాలిని బెదిరించి...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 14, Sep 2018, 3:56 PM IST
Delhi Cop's Son Arrested After he Assaults Woman in Video to Threaten Ex-Girlfriend
Highlights

ఆ యువకుడి తండ్రి పోలీస్ అధికారి. దీంతో తననెవరూ ఏం చేయలేరని భావించాడో ఏమో గాని ఓ యువతిని పట్టుకుని చితకబాదాడు. అసలు ఎందుకు ఆమెను అంతలా కొట్టాడో కూడా తెలీదు. యువతిని కాలితో తంతూ, ముఖంపై, శరీరంపై పిడిగుద్దులు గుద్దుతూ మృగంలా ప్రవర్తించాడు. పాపం...బాధితురాలు కాళ్లు మొక్కుతూ వదిలిపెట్టాలని బ్రతిమాలినా వినలేదు. అయితే కాల్ సెంటర్ లో జరిగిన ఈ అమానుష దాడికి సంబంధించిన వీడియోను సదరు నిందితుడి ప్రియురాలే బైటపెట్టింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  రోహిత్ అనే యువకుడి తండ్రి డిల్లీలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. దీంతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోహిత్ రెచ్చిపోయేవాడు. ఇతడు జ్యోతి శర్మ అనే యువతి గతంలో ప్రేమించుకున్నారు. అయితే అతడి ప్రవర్తన నచ్చక గతకొంత కాలంగా జ్యోతిశర్మ అతడికి దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న రోహిత్ పలు రకాలుగా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఇలా ఆమెకు గతంలో తాను దాడిచేసిన యువతి వీడియోను పంపిన రోహిత్...తన మాట వినకుంటే ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ వీడియోను చూసి భయపడిపోయిన జ్యోతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో ఆమె నుండి పిర్యాదును స్వీకరించడంతో పాటు వీడియో ఆదారంగా పోలీసులు రోహిత్ పై పోలీసులు ఐపిసి 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader