కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ సర్వీసుల వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, ఇకపై ఢిల్లీ అభివృద్ధి అనేక రెట్లు వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ సర్వీసుల వివాదంపై గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతించారు.ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. “ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో ఢిల్లీ అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరగనుంది. ప్రజాస్వామ్యం గెలిచింది.” అని పేర్కొన్నారు.
అనంతరరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తన చేతులను కట్టేసి, నీటిలో పడేసిందనీ, అయినా.. తన నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షనీయమని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఈ ధర్మాసనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాము దేశానికి సరికొత్త విద్యా విధానాన్ని పరిచయం చేశామన్నారు. గతంలో కంటే 10 రెట్ల వేగంతో ముందుకు సాగుతామని, యావత్తు దేశానికి సమర్థ పరిపాలన మోడల్ ను ఇకపై ఢిల్లీ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పనులకు ఆటంకాలు సృష్టించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సమర్థులు, నిజాయితీపరులు, బాధ్యత గలవారు, ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం పొందుతారని చెప్పారు.
ఈ తీర్పుపై క్యాబినెట్ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ ..“సత్యమేవ జయతే! అభినందనలు, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం పోరాటం తర్వాత సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ప్రభుత్వానికి దాని హక్కులను ఇచ్చింది. చివరకు ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది.” అని పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి దీనిని సత్య విజయంగా అభివర్ణించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “సత్యమేవ జయతే! సంవత్సరాల పోరాటం తర్వాత.. సుప్రీం కోర్టు కేజ్రీవాల్ ప్రభుత్వానికి దాని హక్కును తిరిగి ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ప్రజల ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు. ఈ చారిత్రాత్మక నిర్ణయం. ఢిల్లీ ప్రజల విజయం. ఇప్పుడు ఢిల్లీ రెట్టింపు వేగంతో పురోగమిస్తుంది. అందరికీ అభినందనలు! ” అని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించటం గమనార్హం. ఈ నిర్ణయంలో అధికారుల పోస్టింగ్, బదిలీ హక్కు ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పబడింది. ఇది కాకుండా.. పరిపాలనా పనులలో, ఎన్నికైన ప్రభుత్వ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ తగ్గించవలసి ఉంటుంది.
