AAP Protest on Kashmir Target Killing: కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీర్‌లో ప్రజలను ఊచకోత కోస్తున్నారని, వారి గొంతు ఎత్తనివ్వడం లేదని సీఎం కేజ్రీవాల్ విమర్శించారు.
AAP Protest on Kashmir Target Killing: కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలు, కాశ్మీరీ పండిట్ల వలసలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కశ్మీర్‌లో జరిగిన హత్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్లను ఎంపిక చేసి చంపేస్తున్నారని అన్నారు. మరోసారి కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందనీ, 90వ దశకంలో ఇలాంటి ఘటనలే జరిగాయనీ, తాజాగా మరోసారి ఆ ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.
కాశ్మీర్‌లో మృతులకు సంతాపంగా సీఎం కేజ్రీవాల్ 2 నిమిషాలు మౌనం పాటించారు. దీని తర్వాత ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ప్రజలను ఊచకోత కోస్తున్నారని, వారి గొంతు ఎత్తనివ్వడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వారిని ఇండ్ల నుంచి లాక్కెళ్లిందనీ. కాశ్మీరీ పండిట్లకు మరోసారి భద్రత కరువైందని, వారికి భద్రత కల్పించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ దారుణాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. మోడీ ప్లాన్ ఏంటీ? ఎన్నో సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రజలకు సమాధానాలు కావాలన్నారు.
కశ్మీర్‌లో జరిగిన హత్యలను ప్రస్తావిస్తూ.. అక్టోబర్ 5న మఖన్ లాల్ బింద్రూ జీ హత్యకు గురయ్యారని కేజ్రీవాల్ అన్నారు. ఇతను మెడికల్ స్టోర్ నడిపేవాడు. అక్టోబర్ 5న వీరేంద్ర పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. అక్టోబర్ 7న సతీందర్ కౌర్, దీపక్ చంద్, అక్టోబర్ 13న సురేంద్ర కుమార్ సింగ్ అనే డ్రైవర్, అక్టోబర్ 17న రంజిత్ సింగ్, జూన్ 2న బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ హత్యలకు గురయ్యారు.
కశ్మీర్‌లో మరోసారి మరణాఖండ ప్రారంభమైన నుంచి యావత్ దేశం విషాదంలో మునిగిపోయిందనీ, ప్రతి భారతీయుడి మదిలో ఆందోళన, బాధ ఉందనీ, కాశ్మీరీ పండిట్లు మరోసారి తమ జన్మస్థలం విడిచి వెళ్లవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన బీజేపీ అసమర్థత, వైఫల్యాల వల్లే వరుస హత్యలు జరిగాయని ఆప్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌లో టార్గెటెడ్ హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. శ్రీనగర్‌లో పోస్ట్ చేయబడిన 177 మంది కాశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను తరలించాలనే డిమాండ్‌ల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇటీవల కశ్మీర్ లోయలో జరిగిన వరుస హత్యలు
దాదాపు గత నెల రోజుల పరిధిలోనే కశ్మీర్ లో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. గత 26 రోజుల్లో వరుసగా.. ఆరు హత్యలు జరిగాయి.
> జూన్ 2న దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ బ్యాంక్ ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ వాసి.
> మే 31, మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఒక హిందూ మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది.
> మే 25న బుద్గామ్‌లో బుల్లితెర నటి అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ సమయంలో ఆమె 10 ఏళ్ల మేనల్లుడు చేతికి బుల్లెట్ గాయమైంది.
> మే 24న శ్రీనగర్‌లో ఓ పోలీసుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు.
ఈ ఘటనలో అతని ఏడేళ్ల కుమార్తె గాయపడింది.
> మే 17న బారాముల్లాలోని దీవాన్‌బాగ్‌లోని వైన్‌షాప్‌పై గుర్తుతెలియని ఉగ్రవాది గ్రెనేడ్ విసిరాడు. ఈ ఘటనలో ఒక్క వ్యక్తి చనిపోయాడు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.
> మే 12న జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ మరణించాడు.
