Asianet News TeluguAsianet News Telugu

భార్యపై చేయి చేసుకున్న బీజేపీ నేత... పార్టీ నుంచి సస్పెన్షన్

భార్యను కొడుతున్న బీజేపీ నేత వీడియో వైరల్ కావడంతో మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆజాద్ సింగ్ ను తొలగిస్తూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చర్యలు తీసుకున్నారు. మెహరౌలి బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడిగా మరో బీజేపీ నాయకుడు వికాస్ తన్వర్ ను నియమించారు.

Delhi BJP leader suspended after slapping wife at party office
Author
Hyderabad, First Published Sep 20, 2019, 11:00 AM IST

భార్య పై చేయిచేసుకన్నందుకు ఓ బీజేపీ నేత భారీ మూల్యంచెల్లించుకోవాల్సి వచ్చింది. పార్టీ ఆఫీసులో భార్యను కొట్టాడని... పార్టీ అధిష్టానం... అతనిని పార్టీ లో నుంచి సస్పెండ్ చేసేసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆజాద్ సింగ్, అతని భార్య, దక్షిణ ఢిల్లీ మాజీ మేయరు సరితా చౌదరీలు భార్యభర్తలు. బీజేపీ కార్యాలయ ఆవరణలోనే తన భార్య సరితా చౌదరిని భర్త అయిన మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆజాద్ సింగ్ చెయ్యి చేసుకున్నాడు. అందరి ముందు ఆమె ను దారుణంగా ఈడ్చుకువెళ్లి కొట్టాడు. అందరి ముందే భార్యను అతి దారుణంగా కొట్టడం గమనార్హం.  బీజేపీ నేత తన భార్యను అలా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 

భార్యను కొడుతున్న బీజేపీ నేత వీడియో వైరల్ కావడంతో మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆజాద్ సింగ్ ను తొలగిస్తూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చర్యలు తీసుకున్నారు. మెహరౌలి బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడిగా మరో బీజేపీ నాయకుడు వికాస్ తన్వర్ ను నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios