నార్త్ గోవాలోని ప్రసిద్ధ అంజునా బీచ్ వద్ద న్యూఢిల్లీకి చెందిన కొంతమంది పర్యాటకులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోవా పోలీసులు సోమవారం నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇలాంటి ఘటనలను సహించేది లేదని అన్నారు.

గోవా పేరు వినగానే సరదాగా, ఉల్లాసంగా గడపవచ్చని అందరూ భావిస్తారు. ప్రజలు అక్కడికి వెళ్లి బీచ్ చిత్రాలను పంచుకుంటారు, కానీ ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం గోవాకు వెళ్లి అనేక షాకింగ్ చిత్రాలను పోస్ట్ చేసింది. నిజానికి.. గోవాలో ఈ కుటుంబంపై ఘోరమైన దాడి జరిగింది. అంజునా బీచ్‌లో జతిన్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.

పర్యాటకులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోవా పోలీసులు సోమవారం నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్న తీరప్రాంతంలో ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు.

Scroll to load tweet…

వివరాల్లోకెళ్లే.. ఢిల్లీకి చెందిన ఈ కుటుంబం మిగతా వారిలాగే గోవాకు వచ్చింది. అయితే.. ఈ సమయంలో కుటుంబ సభ్యుడు జతిన్‌పై దాడి జరిగింది. జతిన్ తన కుటుంబంతో కలిసి అంజునాలోని ఓ రిసార్ట్‌లో ఉంటున్న సమయంలో కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. అతి కష్టం మీద తన ప్రాణాలను కాపాడుకున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కుటుంబ సభ్యులు పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఘటనను ఖండించిన సీఎం ప్రమోద్ సావంత్

పర్యాటకులపై దాడి ఘటన గురించి తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన ఖండనీయమని, ఈ విషయంలో అలసత్వం వహించేది లేదని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సంఘటన యొక్క వీడియో ఇంటర్నెట్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుందని, అందులో కొంతమంది జతిన్‌పై దాడి చేయడం కనిపిస్తుంది.ఈ క్రమంలో గోవా సీఎం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితులెవరూ తప్పించుకోలేరన్నారు.

Scroll to load tweet…