ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్
మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 40వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. 19వేల మంది హోంగార్డులు సైతం విధుల్లో పాల్గొననున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో 1.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81,05236 మంది పురురుషులు కాగా, 66,80,277మంది స్త్రీలు ఉన్నారు.
మొత్తం 672మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏరక్పాట్లు చేశారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఢి్లీలో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు.
మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 40వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. 19వేల మంది హోంగార్డులు సైతం విధుల్లో పాల్గొననున్నారు.
కాగా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 67సీట్లలో ఆమ్ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆప్ ల మధ్య భారీ పోటీ ఉండే అవకాశం ఎక్కువగా కనడపడుతోంది.