New Delhi: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో శనివారం బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అడ్వకేట్ వీరేందర్ కుమార్ నర్వాల్ పై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఈ హత్యను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
Delhi Advocate Shot Dead On Road: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో శనివారం బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అడ్వకేట్ వీరేందర్ కుమార్ నర్వాల్ కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఈ హత్యను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకెళ్తే.. తోటి న్యాయవాది హత్యకు నిరసనగా సోమవారం నాడు అన్ని జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులకు పూర్తిగా దూరం కానున్నారు. దేశ రాజధానిలోని అన్ని జిల్లా బార్ అసోసియేషన్ల సమన్వయ కమిటీ ఆందోళనకు దిగనుందనీ, రేపు విచారణలను నిలిపివేయాలని నిర్ణయించిందని న్యూఢిల్లీ బార్ అసోసియేషన్ (ఎన్డీబీఏ) తన సభ్యులకు రాసిన లేఖలో పేర్కొంది. కోర్టుల వద్ద ఫొటోకాపీ యంత్రాలను కూడా మూసివేయనున్నారు.
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో న్యాయవాది వీరేందర్ కుమార్ నర్వాల్ ను బైక్ పై వచ్చిన నరేష్, ప్రదీప్ అనే ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ప్రదీప్ తో 36 ఏళ్ల వైరం కారణంగా నర్వాల్ హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పారు. అతని తాత 1987 లో ప్రదీప్ మామను చంపినట్లు తెలుస్తోంది. ప్రదీప్ ఆశించిన కొంత భూ పరిహారానికి నర్వాల్ న్యాయపరమైన అడ్డంకులు కూడా కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన ప్రదీప్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. 2017లో కూడా నర్వాల్ ను చంపేందుకు ప్రయత్నించగా లాయర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా డ్రైవర్ కు గాయాలయ్యాయి.
దాడి తర్వాత వీరేందర్ కుమార్ నర్వాల్ కు పోలీసు రక్షణ లభించింది, కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో దానిని ఉపసంహరించుకున్నారు. పట్టపగలు జరిగిన ఈ హత్యను ఖండించిన న్యాయవాదులు ఢిల్లీలోని మొత్తం న్యాయవాదులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. న్యాయవాదులపై బెదిరింపులు, హింసాత్మక చర్యల ఘటనలు పెరుగుతున్నాయని, అయితే వారి కుటుంబాలు దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వారికి భద్రత కల్పించలేదని నార్త్ ఢిల్లీ లాయర్స్ అసోసియేషన్ (ఎన్డీఎల్ఏ) తెలిపింది. న్యాయవాదుల (రక్షణ) బిల్లు-2021, వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో న్యాయవాదులకు, వారి విధులకు ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. దీనిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్.
అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఎన్డీఎల్ఏ ఎప్పటి నుంచో గళం విప్పుతోందని, ఇప్పుడు ఢిల్లీలో తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకువచ్చి అమలు చేయడానికి సమయం అన్నమైందనీ, అడ్వొకేట్ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకోవాలని సీపీ, ఢిల్లీ పోలీసులను కోరుతున్నామని న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు.
