Asianet News TeluguAsianet News Telugu

తనతో సంబంధం తిరస్కరించిందని.. కత్తితో పొడిచి మహిళ దారుణ హత్య..

పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలోని ఓం విహార్‌లోని మటియాలా రోడ్డు నుంచి మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటలకు తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే తాము అక్కడికి చేరుకునేసరికి ఆ మహిళ రక్తపు మడుగులో ఉందని, ఆమె పక్కనే knife కూడా పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఫ్రీలాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న dolly babbar గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
 

Delhi : 23-year-old stabbed to death in Uttam Nagar, killer believed to be a youth she spurned
Author
Hyderabad, First Published Oct 20, 2021, 9:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ : తను ఎన్నిసార్లు రిలేషన్ షిప్ కోసం ప్రపోజ్ చేసినా నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి  మహిళను అతిదారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెడితే.. 23 యేళ్ల ఓ మహిళ మీద ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచాడు. ఆమె సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించింది. రాత్రి 11 గంటల సమయంలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం ఇంటినుంచి బయటికి వచ్చింది. ఆ తరువాత రెండు, మూడు గంటలకు ఇంటికి బయలుదేరింది. ఇంటిసమీపంలోకి వచ్చిన తరువాత, ఇంటికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు కత్తితో stab చేశారు. ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ గమనించారు.

పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలోని ఓం విహార్‌లోని మటియాలా రోడ్డు నుంచి మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటలకు తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే తాము అక్కడికి చేరుకునేసరికి ఆ మహిళ రక్తపు మడుగులో ఉందని, ఆమె పక్కనే knife కూడా పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఫ్రీలాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న dolly babbar గా గుర్తించామని పోలీసులు తెలిపారు.

డాలీ తమ్ముడు లక్షయ్ ఈ ఘట మీద మాట్లాడుతూ..  నాకు మా అక్క boy friend నుంచి కాల్ వచ్చింది. ఆమె ప్రమాదంలో ఉందని అతను చెప్పాడు. అంతేకాదు డాలీ తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి..‘అంకిత్ గబా నా తలపై తుపాకీ పెట్టి నన్ను బెదిరించాడని చెప్పింది"అని తెలిపినట్టు అని లక్షయ్ ఆరోపించారు. ఆ వెంటనే డాలీకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని.. ఆ తరువాత కాసేపటికే ఆమె మీద దాడి జరిగిందంటూ పోలీసులు తమ ఇంటికి వచ్చి చెప్పారని అన్నాడు. 

ఆమె చేతులు, మెడ, ఛాతీ, వీపుపై Stabs అయ్యాయి. తీవ్ర Bleeding అయ్యిందని లక్షయ్ తెలిపాడు. నిందితుడు గబా, (25) డాలీని చాలా సంవత్సరాలుగా వేధిస్తున్నాడని సోదరుడు పేర్కొన్నాడు, కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదని అందుకే proposals చేసిన ప్రతీసారి తిరస్కరించిందని తెలిపాడు. ఈ విషయం డాలీ కజిన్ సంజన ధృవీకరించింది. 

ఆమె మాట్లాడుతూ "చాలా కాలంగా, అంకిత్ తనతో సంబంధం పెట్టుకోవాలని ఆమెను వేధిస్తున్నాడు. కానీ ఆమె అతడిని ప్రతీసారి తిరస్కరించింది." ఐదేళ్ల క్రితం గబా చెల్లెలుతో అతని అనుబంధం కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని కూడా లక్షయ్ ఊహించాడు.

డాలీ తల్లి మీనా బబ్బర్ మాట్లాడుతూ.. కూతురు  తన స్నేహితుడి ఇంట్లో కేక్ కటింగ్ కోసం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి  బయలుదేరినట్లు గుర్తు చేసుకున్నారు. వెళ్లేముందు "ఆందోళన చెందవద్దని, అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి చేరుకుంటానని చెప్పిందని’ గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో, డాలీ బదులు పోలీసులుతలుపులు తట్టారు”అని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. 

డాలీ, కుటుంబాన్ని మొత్తం పోషిస్తుందని, చాలా చురుకైందని, స్ట్రాంగ్ లేడీ అని ఆమె చెప్పుకొచ్చింది. లాక్డౌన్ సమయంలో డాలీ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినా మెల్లిగా వేరే ఉద్యోగం వెతుక్కుంది. డాలీ తండ్రి ఆటోరిక్షా నడుపుతాడు.

ఫుట్ బాల్ సాక్స్ ఆర్డర్ చేస్తే.. బ్రా వచ్చింది.. షాక్ అయిన అతను చేసిన పని....

ఆమె హత్యకు గురైన ప్రదేశం antisocials కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించారు. బబ్బార్‌ల పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ.. “మేము అక్కడ ఒక సీసీ కెమెరా కూడా పెట్టాం, కానీ ఎవరో దొంగిలించారు. ప్రతిరోజూ, స్థానిక అబ్బాయిలు అక్కడ మద్యం సేవిస్తారు. అలా చేయద్దని చెబితే...మమ్మల్ని బెదిరిస్తారు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమలో చాలామంది ఈ దాడిని చూశారని, అయితే తమ భద్రత కోసం భయపడి డాలీ సహాయానికి వెళ్లడానికి ధైర్యం చేయలేదని వారు పేర్కొన్నారు.

ముగ్గురు నిందితులైన యువకులలో ఒకరు నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే నివసిస్తున్నాడు. అయితే దీనిమీద అతని సోదరి మాట్లాడుతూ.. “నా సోదరుడు డాలీని చంపేసి ఉంటాడని నేను అనుకోను. అతను డాలీని సోదరిగా భావించాడు. ఆమెతో రాఖీ కూడా కట్టించుకున్నాడు. అయితే అతను ప్రస్తుతం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు, తిరిగి రాలేదు’’ అని చెప్పుకొచ్చింది. 

నేరం జరిగిన ప్రదేశంలో గబాతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు బాలనేరస్తులని పోలీసులు నిర్ధారించారు.  DCP శంకర్ చౌదరి (ద్వారక) మాట్లాడుతూ, "అమ్మాయి మాజీ ప్రేమికుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. అతని మీద హత్య కేసు నమోదయ్యింది’’అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios